/rtv/media/media_files/2025/04/11/1StYNVFhYLKbb8M6DJrN.jpg)
Mumbai Attack Mastermind Headley
ముంబయ్ ఉగ్రదాడుల కీలక సూత్రధారి అయిన తహవూర్ రాణా ఇప్పుడు భారత అధికారుల చేతుల్లో ఉన్నాడు. రెండు రోజుల క్రితం అతన్ని అమెరికా ఇండియాకు అప్పగించింది. దాంతో అక్కడి నుంచి అధికారులు రాణాను తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇతను ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. రెండు రోజులుగా ప్రయాణం, జడ్జి ముందు ప్రవేశపెట్టడం లాంటి ప్రొసీడింగ్స్ తో అధికారులు రాణాను ఎక్కువ సేపు విచారించలేకపోయారు. కానీ ఇప్పుడు అన్నీ సెటిల్ అయ్యాయి కాబట్టి తహవూర్ రాణాను పూర్తిగా విచారించాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా పూర్తి ప్రశ్నావళిని తయారు చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నారు. తహవూర్ రాణా, లష్కరే తోయిబాల మధ్య బంధంతో పాటూ, దాడిలో వారి పాత్ర, మరో ఉగ్రవాది హెడ్లీ గురించి కూడా వివరాలను తెలుసుకోనున్నారు.
ఇద్దరూ కలిసి పథక రచన..
ముంబయ్ 26/11 అటాక్ లో మొత్తం 166 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. భారత్ లో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడుల్లో ఇది ఒకటి. ఈ మొత్తం దాడిని రచించింది ఇద్దరు. ఒకరు దేడిడ్ హెడ్లీ అయితే మరొకరు తహవూర్ రాణా. హెడ్లీ మెయిన్ గా మొత్తం పథకం రచించాడు. అతనికి తహవూర్ రాణా సహకరించాడు. దీని కోసం హెడ్లీ తరుచూ అమెరికా నుంచి భారత్ వస్తుండేవాడు. ఈ క్రమంలో తహవూర్ రాణాను కలుస్తుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరూ 231 సార్లు ఫోన్ లో మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కాల్ రికార్డ్ లన్నింటినీ ఎన్ఐఏ పరిశీలిస్తోంది. దాంతో పాటూ వీటి గురించి తహవూర్ రాణాను అడిగి తెలుసుకోనుంది.
ఎప్పుడు ఎన్నిసార్లు..
ముంబై దాడులకు ముందు హెడ్లీ మొదటిసారి రిసెప్షన్ కోసం భారతదేశానికి వచ్చినప్పుడు, అతను తహవూర్ రాణాతో దాదాపు 32 సార్లు మాట్లాడాడు. తరువాత రెండవసారి మళ్ళీ వచ్చినప్పుడు హెడ్లీ తహవ్వూర్ రాణాతో 23 సార్లు మాట్లాడాడు. హెడ్లీ మూడోసారి భారతదేశానికి వచ్చినప్పుడు, అతను రాణాతో మొబైల్‌లో 40 సార్లు మాట్లాడాడు. కానీ నాలుగు పారి వచ్చినప్పుడు మాత్రం ఎటువంటి సంభాషణలూ జరపలేదు. అయితే మళ్ళీ హెడ్లీ ఐదవసారి ఇండియా వచ్చినప్పుడు తహవ్వూర్ తో 37 సార్లు మాట్లాడాడు. అలాగే ఆరోసారి భారతదేశానికి వచ్చినప్పుడు 33 సార్లు..
ఎనిమిదవసారి 66 సార్లు మాట్లాడాడు. మొత్తంగా ముంబై అటాక్ ప్లానింగ్ లో భాగంగా 8 సార్లు ఇండియా వచ్చి 231 సార్లు తహవూర్ రాణాతో సంప్రదింపులు జరిపాడు. అన్ని సంభాషణలు కూడా మొబైల్ ఫోన్ ద్వారానే జరిగాయి.
today-latest-news-in-telugu | Tahawwur Rana | nia | phone-calls
Also Read: IPL 2025: ధోనీ అవుట్ కాదా? వివాదాస్పదమౌతున్న థర్డ్ అంపైర్ నిర్ణయం