/rtv/media/media_files/2026/01/17/didi-vs-bjp-2026-01-17-10-10-47.jpg)
పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ హవా తగ్గుతోందా అంటే అవుననే అంటున్నారు. తాజాగా బీజేపీ అక్కడ కూడా నెమ్మదిగా పాగా వేయడానికి చూస్తోంది. దానికి కోసం వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి సీఎం మమతా బెనర్జీపై ఏకంగా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. బొగ్గు కుంభకోణంతో తనను ముడిపెడుతూ దీదీ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని...అవి న ప్రతిష్టను దిగజార్చుతున్నాని సువేందు ఆరోపించారు. దీనికి సంబంధించి కోల్‌కతాలోని అలీపూర్ కోర్టులో శుక్రవారం ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు.
అసలేంటీ వివాదం..
అసలు వివాదం జనవరి 8, 9 తేదీలలో మమతా బెనర్జీ చేసిన బహిరంగ ప్రసంగాలతో మొదలైంది. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన నిధులు సువేందు అధికారి ద్వారా హోం మంత్రి అమిత్ షాకు చేరుతున్నాయని...దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిని బీజేపీ అప్పుడే ఖండించింది. అక్కడితో ఏరుకోకుండా...తన న్యాయవాది ద్వారా వెంటనే మమతకు నోటీసులు పంపారు. 72 గంటల్లోగా ఆ ఆరోపణలను నిరూపించాలని, లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే సీఎం మమతా బెనర్జీ దీనిపై ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.
దీంతో సువేందు న్యాయపోరాటానికి దిగారు. తాను ఇచ్చిన మాట మీద నిలబెడతానని..తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన విషయంలో కోర్టుకు ఈడ్చుతానని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆధారాలు లేకుండా మాట్లాడటం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు ఈ కేసులో కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చి డబ్బులు చేతికి వస్తే..ఆ వంద కోట్ల సొమ్మును పూర్తిగా సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని చెప్పారు. టీఎంసీ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే తనపై ఇలాంటి వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.
Also Read: thackeray Brothers: తమ్ముడి దెబ్బ..అన్న అబ్బా.. ఠాక్రేల ఏకఛత్రాధిపత్యం హుష్ కాకి
Follow Us