/rtv/media/media_files/2026/01/13/himalayas-2026-01-13-15-52-53.jpg)
Himalayas bare and rocky after reduced winter snowfall, scientists warn
కశ్మీర్ అంటే అందరికీ మొదటగా గుర్తకొచ్చేది మంచు. వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది పర్యాటకులు ఇక్కడి అందమైన దృశ్యాలను చూసేందుకు వస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా కశ్మీర్‌లో మంచు తగ్గుతూ వస్తోంది. ఈసారి కూడా చలికాలం అక్కడ హిమపాతం అత్యంత తక్కువగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ మార్పుల వల్లే కశ్మీర్‌కు ఇలాంటి పరిస్థితులు ఎదురువుతున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. వెంటనే దీనిపై తర్యలు తీసుకోకుంటే ముప్పు తప్పదంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే ఈ చలికాలం సీజన్‌లో కశ్మీర్ లోయలో హిమపాతం సాధారణం కన్నా అతి తక్కువగా రికార్డయ్యింది. దీంతో కశ్మీర్ అందాలు బోసిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి అక్కడ ఆర్థికంగా, సాగుపరంగా, పర్యాటకపరంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా మైదాన ప్రాంతాలు, అంతగా ఎత్తు ఉండని ప్రదేశాల్లో మంచు కనిపించడం లేదు. దీంతో అక్కడి స్థానిక రైతులు, వ్యాపారులు, గైడ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కశ్మీర్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం వస్తుందని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన ప్రొఫెసర్ అంజల్ ప్రకాశ్ వెల్లడించారు.
Also Read: పది నిమిషాల డెలివరికీ బ్లింకిట్ గుడ్‌బై...30 వేల ఉత్పత్తులు డెలివరీకి శ్రీకారం
తగ్గుతున్న మంచు
కశ్మీర్ లోయలో కురిసే మంచు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చలికాలంలో గడ్డ కట్టి.. వేసవి కాలం వస్తున్న కొద్ది దిగువ ప్రాంతాలకు నిరంతరం నీటిని విడుదల చేస్తుంటాయి. జీలం లాంటి కీలక నదులకు సైతం ఈ నీరు జీవనాధారంగా నిలుస్తోంది. వివిధ పట్టణాలు, గ్రామాల ప్రజలు ఈ నీటిపైనే ఆధారపడుతున్నారు. అంతేకాదు వేసవిలో కరిగే ఈ నీటి ద్వారానే కశ్మీర్ లోయలో వ్యవసాయం సాగు చేస్తారు. ప్రస్తుతం మంచు తగ్గిపోవడంతో వ్యవసాయంతో పాటు తాగునీటికి కూడా నీరు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి. దీని ప్రభావంతో కశ్మీర్ యాపిల్స్ దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశాలున్నాయి. రైతులు ఇక భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నేళ్ల తర్వాత అక్కడ కూడా నీరు దొరికే అవకాశాలు తగ్గిపోతాయని అంజల్ ప్రకాశ్ అంటున్నారు.
ప్రమాదమే
మరోవైపు ఉత్తర భారత్‌లో పర్వత ప్రాంతాలు వేడెక్కుతున్నాయి. ఇతర మైదాన ప్రాంతాలతో పోలిస్తే హిమాలయాలు ఎక్కువగా వేడెక్కుతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రపంచ సగటు కన్నా చాలా ఎక్కువగా ఉందని.. ఇలా ఉండటం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. దేశాలన్ని మేల్కొని పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు. లేకపోతే వినాశకర పరిస్థితులకు దారి తీస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు.
Also Read: ట్రంప్ సంచలన నిర్ణయం.. గ్రీన్‌లాండ్ విలీనం కోసం బిల్లు ప్రవేశపెట్టిన అమెరికా
ఏటా చలికాలం వచ్చినప్పుడు కశ్మీర్‌లో సున్నా డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువకి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఈసారి కూడా అలాగే జరిగినప్పటికీ హిమపాతం మాత్రం తక్కువగా నమోదయ్యింది. సోన్‌మార్గ్, పీర్‌పంజల్, గుల్‌మార్గ్ శ్రేణి వంటి అత్యున్నత కొండ ప్రాంతాలకే హిమపాతం పరిమితమైంది. మిగతా కశ్మీర్ ప్రాంతంలో మంచు లేదు. గ్లోబల్ వార్మింగ్ వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని పర్యావరణవేత్త అనిల్ జోషి అన్నారు.
కశ్మీర్‌లో శీతాకాలం వచ్చిందంటే పర్యాటక సందడి నెలకొంటుంది. కానీ ఇప్పుడు మాత్రం కశ్మీర్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోతోంది. ప్రతి సంవత్సరం స్కేయింగ్ వంటివి జరిగే ప్రాంతాల్లో కూడా ఈసారి మంచు కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాల వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని గైడ్‌లు, హోటల్ వ్యాపారులు వాపోతున్నారు.
Follow Us