/rtv/media/media_files/2026/01/13/fotojet-2026-01-13t153826-2026-01-13-15-38-54.jpg)
Blinkit says goodbye to ten-minute delivery
10 Minutes Home Delivery: ఆన్‌లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు గొప్పగా చెప్పుకునే '10 నిమిషాల డెలివరీ' గడువుకు కాలం చెల్లింది. గిగ్ వర్కర్ల ప్రాణాల భద్రత దృష్ట్యా ఈ నిబంధనను వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం క్విక్ కామర్స్ సంస్థలను ఆదేశించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ప్రముఖ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో పది నిమిషాల్లో హోమ్ డెలివరీ ట్యాగ్ తొలగించాయి. అదే సమయంలో గిగ్ వర్కర్ల భద్రత, వేతన పెంపు కోసం చర్యలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా అందరికంటే ముందుగా ఈ విషయమై స్పందించిన బ్లింకిట్ సంస్థ ఇప్పటికే తన బ్రాండింగ్ నుంచి '10 నిమిషాల డెలివరీ' అనే ట్యాగ్‌ను తొలగించింది. అయితే అదే స్థానంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి సూచనలతో బ్లింకిట్ వంటి ఈ-కామర్స్ డెలివరీ సంస్థలు తమ 10 నిమిషాల ఆఫర్‌ను నిలిపివేశాయి. అదే సమయంలో బ్లింకిట్10 నిమిషాల ఆప్షన్‌కు బదులు 30 వేల ఉత్పత్తులు డెలివరీగా మారుతోంది.
వేగంగా డెలివరీ చేయడం కంటే, వారి క్షేమం చూడటం ముఖ్యం అని మంత్రి చేసిన సూచనల మేరకు బ్లింకిట్ ( Blinkit ) వంటి సంస్థలు తమ 10 నిమిషాల డెలివరీ హామీ నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. ఇది డెలివరీ భాగస్వాములకు మరింత సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడంలో సహాయపడుతుంది.కాగా, 10 నిమిషాల డెలివరీ నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గతేడాది డిసెంబరు 31న గిగ్ వర్కర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నిబంధన తమ ప్రాణాలకు ముప్పుగా పరిణమించిందని చాలా కాలం నుంచి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాగా బ్లింకిట్ తన ‘10 నిమిషాల్లో 10,000+ ఉత్పత్తులు డెలివరీ’ అనే ట్యాగ్‌లైన్‌ను ‘30,000+ ఉత్పత్తులు మీ ఇంటి వద్దకే డెలివరీ’గా సవరించింది.
Follow Us