Supreme Court: కుక్కకాటుకు 54 మంది మృతి.. సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ

దేశంలో వీధి కుక్కల బెడద బాగా పెరిగిపోయిన నేపథ్యంలో తాజాగా దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనికి సంబంధించిన నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించింది.

New Update
Supreme Court takes suo motu cognisance of stray dog menace after child’s death in Delhi

Supreme Court takes suo motu cognisance of stray dog menace after child’s death in Delhi

దేశంలో వీధి కుక్కల బెడద బాగా పెరిగిపోయింది. చాలా ప్రాంతాల్లో చిన్నారులు, పెద్దవాళ్లు కుక్కకాటుకు గురవుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కూడా వీధి కుక్కల బెడద గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు చిన్నారులు కుక్కల దాడిలో మృతి చెందడం కలకలం రేపింది. మీడియాలో కూడా వీధి కుక్కుల బెడదపై ఎక్కువగా వార్తలు వచ్చాయి. ఇటీవల ఢిల్లీలో ఓ ఆరేళ్ల చిన్నారి కూడా కుక్క కాటుకు గురై రేబిస్ వ్యాధితో మృతి చెందింది. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది.  

Also Read: అద్భుతం.. కేవలం రూ.7 వేలతోనే విమానాన్ని తయారు చేసిన యువకుడు

జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్‌ మాహాదేవన్‌తో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. వీధి కుక్కల బెడదను తీవ్ర ఆందోళనకరమైన అంశంగా పేర్కొంది. ప్రతిరోజు దేశ రాజధాని ఢిల్లీలో వందలాది వీధి కుక్కల దాడుల కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. కుక్క కాటు వల్ల చిన్నారులు, పెద్దలు కూడా ప్రమాదకరమైన రేబిస్‌ వ్యాధికి గురై చనిపోతున్నారని తెలిపింది. దీనికి సంబంధించిన నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించింది. 

Also Read: లోక్‌సభలో ఆపరేషన్‌ సిందూర్‌పై గందరగోళం.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

ఇదిలాఉండగా పార్లమెంట్‌లో కూడా వీధి కుక్కల బెడదకు సంబంధించి ప్రస్తావన వచ్చింది. కేంద్రమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ దీని గురించి సమాచారం అందించారు. 2024లో దేశవ్యా్ప్తంగా 37 లక్షల మంది కుక్క కాటుకు గురైనట్లు పేర్కొన్నారు. దీనివల్ల రేబిస్ వ్యాధి సోకి ఏకంగా 54 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. మరోవైపు వీధి కుక్కల బెడత ఉన్న ప్రాంతాల్లో వాటికి అధికారులు స్టెరిలైజేషన్ చేయిస్తున్నారు. 

Also Read: ఛీ ఛీ.. గబ్బిలాలతో చిల్లీ చికెన్ - రాష్ట్రంలో బయటపడ్డ మోసం

Advertisment
తాజా కథనాలు