/rtv/media/media_files/2025/04/16/a2Aysv8LEybke2TC8nZJ.jpg)
Supreme Court sensational verdict in rape case
Spreme court: అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కేసు విచారణలో భాగంగా కోర్టులోనే బాధితురాలికి లవ్ ప్రపోజ్ చేయడంతో నిందితుడి శిక్షను రద్దు చేసింది. అంతేకాదు కోర్టు గదిలోనే ఒకరికొకరు పూలు ఇచ్చిపుచ్చుకోవాలని సూచించడం గమనార్హం. కాగా అలాగే నిందుతుడు, బాధితురాలు వివాహం చేసుకోవాలని కోరింది. ఇక ఈ వివాహ వివరాలను తల్లిదండ్రులు నిర్ణయిస్తారని కోర్టు పేర్కొంది.
Also Read: దేశ ప్రధానిని పొగిడితే తప్పేంటి.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరో ప్రకటన
ఇష్టంతోనే లైంగిక దాడి..
న్యాయమూర్తులు బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ అత్యాచారం కేసుపై వివరణ ఇచ్చింది. 'మేము భోజన సమయంలో వారిద్దరినీ కలిశాం. వారు ఒకరిపట్ల ఒకరు ప్రేమను కలిగివున్నట్లు గుర్తించాం. మొదట అమ్మాయిపై ఇష్టంతోనే అతను లైంగిక దాడికి పాల్పడ్డట్లు చెప్పారు. అయితే అప్పుడు అతన్ని ఇష్టపడని అమ్మాయి ఇప్పుడు అతనితో పెళ్లి ఇష్టమేనని చెప్పింది. కావున వారిద్దరినీ కలిపేందుకు ఈ కేసు ఇంతటితో ముగించాలని నిర్ణయించాం' అని తెలిపారు. ఇక ఈ పెళ్లి వీలైనంత త్వరగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.