Kerala : విడాకుల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దంపతుల మధ్య విడాకుల కేసు ముగిసేవరకూ అత్తగారింటికి సంబంధించిన ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందని, భర్త పొందే ప్రయోజనాలన్ని ఆమెకు దక్కాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు నెల వారీ ఖర్చులను కూడా చెల్లించాలని సూచించింది.
Also Read : చిట్టి రోబో బడా దొంగతనం.. 12 రోబోట్‌లను కిడ్నాప్ చేసి..!
నెలకు రూ.2.50 లక్షలను భరణం..
ఈ మేరకు కేరళకు చెందిన ప్రముఖ కార్డియాలాజిస్ట్ విడాకులు కావాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఆ కేసు పెండింగ్‌లో ఉండగానే తనకు నెలకు రూ.2.50 లక్షలను భరణం కింద ఇప్పించాలని అతని భార్య ఫ్యామిలీ కోర్టును అభ్యర్థించారు. దీంతో భరణాన్ని రూ.1.75 లక్షలకు పెంచుతూ జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పి.బి.వరాలే ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: సోషల్ మీడియా యూజర్లకు సీఎం వార్నింగ్.. అలా చేస్తే పీడీ యాక్ట్ కేసు!
నెల వారీ భరణాన్ని రూ.80 వేలకు తగ్గిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. భర్త సంపాదన, ఆస్తులను పరిగణనలోకి తీసుకుని నెలకు రూ.1.75లక్షల భరణాన్ని ఇవ్వాలని ఆదేశించింది. దీంతో మద్రాస్ హైకోర్టులో అతను మరోసారి సవాల్ చేయగా.. భార్యకు చెల్లించాల్సిన భరణాన్ని రూ.80వేలకు తగ్గించింది. చివరకు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.
Also Read : మల్లారెడ్డి ఆస్పత్రిపై కేసు నమోదు.. వారే చంపేశారంటూ రోగి బంధువులు..!
Also Read : 10,12 పరీక్షల తేదీని ప్రకటించిన సీబీఎస్‌ఈ బోర్డు