మల్లారెడ్డి ఆస్పత్రిపై కేసు నమోదు.. వారే చంపేశారంటూ రోగి బంధువులు..! బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సూరారంలోని ఆస్పత్రిపై కేసు నమోదైంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మెదక్ జిల్లాకు చెందిన లక్ష్మీ మృతి చెందిందంటూ బాధితురాలి ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 21 Nov 2024 | నవీకరించబడింది పై 21 Nov 2024 09:21 IST in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Hyderabad : బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సూరారంలోని ఆస్పత్రిపై కేసు నమోదైంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మెదక్ జిల్లాకు చెందిన లక్ష్మీ మృతి చెందిందంటూ బాధితురాలి ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read: మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ ఇవ్వని మేజర్ సంస్థలు..కారణం ఏమై ఉంటుంది? బ్రేన్ సమస్యతో అడ్మిట్ చేస్తే.. ఈ మేరకు మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతార్ పల్లికి చెందిన చిన్నవల్లోల్ల లక్ష్మి (48) అనారోగ్యంతో ఆగస్టు 31న మల్లారెడ్డి ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె బ్రేన్ సమస్య ఉన్నట్లు గుర్తించి ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వారు అంగీకరించగా ఆపరేషన్ చేశారు వైద్యులు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆపరేషన్ చేసిన మహిళా చనిపోవడం సంచలనం రేపింది. ఈ విషయాన్ని దాచిన వైద్య సిబ్బంది వెంటిలేటర్ పై ఉంచామంటూ డ్రామాలు మొదలుపెట్టారు. ఇది కూడా చదవండి: ఇవి తింటే బరువు తగ్గడం కన్ఫామ్ రిపోర్టులు ఇవ్వకుండా కాగితాలపై సంతకాలు.. అంతటితో ఆగకుండా బిల్లులు వసూల్ డ్రామా మొదలుపెట్టారు. మొదటి దశలో రూ.25 వేలు తీసుకున్నారు. సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటలకు ఆపరేష్ ప్రారంభించి, సాయంత్రం 6 గంటలకు పూర్తి చేశామంటూ సెప్టెంబర్ 9న రూ.78 వేలు చెల్లించి మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బ్రేయిన్ స్ట్రోక్ వస్తే ఇంత ఆసల్యంగా ఎందుకు చెబుతున్నారని బాధిత కుటుంబసభ్యులు నిలదీశారు. రిపోర్టులు ఇవ్వకుండా కాగితాలపై సంతకాలు తీసుకుని లక్ష్మిని తీసుకెళ్లడానికి అనుమతించారు. అంబులెన్స్ లో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో లక్ష్మి చనిపోవడంతో అసలు గుట్టు బయటపడింది. ఇది కూడా చదవండి: Food Poisoning: నారాయణపేటలో ఘోరం.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత లక్ష్మీని స్వగ్రామానికి తీసుకెళ్లి ఖననం చేసిన అనంతరం లక్ష్మీ కూతురు అశ్విని సూరారం పోలీసులకు నవంబర్ 18న ఫిర్యాదు చేసింది. వైద్యులు ఆపరేషన్ చేసిన రోజే తన తల్లి చనిపోగా వెంటిలేటర్ పై ఉంచి తమను మభ్యపెట్టారంటూ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: గౌతమ్ అదానీకి అరెస్ట్ వారెంట్.. అతని అల్లునిపై కూడా.. #brs #hospital #malla-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి