Telangana: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం మరింతబలపడినట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. దీంతో రానున్న 24 గంటల్లో తమిళనాడు, ఏపీ తీరం పైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు వివరించారు. దీని ప్రభావంతో ఏపీ,తమిళనాడుతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించారు. తీరం వెంట 30-35 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చారు.
Also Read: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!
రాష్ట్రంలో శుక్రవారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.ఎలాంటి హెచ్చరికలు లేవని వెదర్ బులిటెన్‌లో పేర్కొంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పొడి వాతావరణం ఉండే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండే అవకాశాలున్నాయన్నారు. ఆ తర్వాత కొంచెం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
రేపు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. ప్రస్తుతం తెలంగాణలో చలి తీవ్రత కాస్త తగ్గింది. నిన్నమొన్నటి వరకు ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. హైదరాబాద్ నగరంలోనూ 11 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ప్రస్తుతం 18-20 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Also Read: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు
మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని.. ఆ తర్వాత చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఇక అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల్లో ఏపీలోని కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.
Also Read: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
ఏపీలో నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.