/rtv/media/media_files/2026/02/09/toll-gate-2026-02-09-19-20-59.jpg)
Toll gate
New FASTag Rule: జాతీయ రహదారులపై టోల్ ఫీజూ వసూలు చేయడానికి కేంద్రం టోల్‌ఫ్లాజాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. అయితే టోల్ ఈజీ చేయడానికి ఫాస్టాగ్ ను తీసుకువచ్చింది.ఈ విధానం ద్వారా టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ గా టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే, ఈ ఫాస్టాగ్ వచ్చిన తర్వాత కూడా పలు సమయాల్లో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఇది జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాదారులు తప్పకుండా తెలుసుకోవలసిన అవసరం ఉంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మరి, కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయమేంటి? దాని వల్ల వాహనదారులకు కలిగే నష్టమేంటో తెలుసుకుందాం..
సాధారణంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు వాహనానికి ఉన్న ఫాస్టాగ్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద డబ్బులు చెల్లిస్తుంటారు. అదే, ఒకవేళ ఫాస్టాగ్ లేకపోతే వారు యూపీఐ ద్వారా మనీ పే చేస్తుంటారు. ఈ అవకాశం కూడా లేనివారు క్యాష్ రూపంలో టోల్ రుసుము కట్టడం సహజం. ఇక్కడే సమస్య వస్తోంది. నగదు చెల్లింపుల కారణంగా చాలా సమయం వృథా అవుతోంది. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్​ జామ్​ అవుతోంది. ఈ నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా రద్దు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగని టోల్‌చార్జీలు పూర్తిగా నిలిపివేస్తారని కాదు.
ఇక మీదట వాటి ద్వారానే చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద ఏప్రిల్ 1వ తేదీ నుంచి నగదు తీసుకునే క్యాష్ లేన్లు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనదారులు ఇక నుంచి కేవలం ఫాస్టాగ్, యూపీఐ యాప్‌ల ద్వారా మాత్రమే తమ టోల్ ఛార్జీలను పే చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పిది. హైవేలపై ఎలాంటి అడ్డంకులూ లేకుండా ప్రయాణం వేగంగా, సాఫీగా సాగేలా చూసేందుకే క్యాష్ పేమెంట్లు రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఫాస్టాగ్, యూపీఐ లేకుండా కేవలం నగదుతో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు టోల్ గేట్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటున్నారు నిపుణులు.
వాహనదారులు ఇలా చేయండి
హై-వేలపై ప్రయాణించేవారు ఇబ్బందులు ఎదుర్కోవద్దంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలంటున్నారు అధికారులు.ముఖ్యంగా వాహనదారులు ఇప్పటివరకు ఉన్న ఫాస్టాగ్​ ను అప్​డేట్ చేసుకోవాలి. అదేవిధంగా, ఫాస్టాగ్ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. ఇంటి నుంచి వెళ్లే ముందే ఫాస్టాగ్​ వాలెట్​లో సరిపడా బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవాలి. ఒకవేళ తగినంత అమౌంట్ లేకపోతే రీఛార్జ్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఫాస్టాగ్ ఉన్నా ఏదైనా అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండడగానికి యూపీఐ ద్వారా చెల్లింపు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
ఫాస్టాగ్ లో నగదు ఉందో లేదో తెలుసుకోవడానికి మీ మొబైల్​లో గూగుల్ ప్లే స్టోర్​లో "MY FASTag యాప్" డౌన్​లోడ్ చేసి సింపుల్​గా ఫాస్టాగ్ అమౌంట్ తెలుసుకోవచ్చు. ఈ యాప్​ లో ఫాస్టాగ్ అకౌంట్ డీటెయిల్స్​ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన అయ్యాక మీ ఫాస్టాగ్ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు ఈజీగా తెలుసుకోవచ్చు.అంతేకాక ఫాస్టాగ్ బ్యాలెన్స్​ ను మిస్డ్​ కాల్ ద్వారా కూడా సింపుల్​ గా చెక్ చేసుకోవచ్చు. అయితే, దీనికోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ప్రీపెయిడ్ వాలెట్​ కు మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలి.అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 88843 33331కి మిస్డ్ కాల్ ఇస్తే చాలు. మీ ఫోన్‌లో ప్రస్తుత ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ చూపిస్తూ మెసేజ్ వస్తుంది.
Follow Us