నేడు సుప్రీంకోర్టు సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ డి.వై చంద్రచూడ్ పదవీ కాలం ముగియడంతో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. By Kusuma 11 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి జస్టిస్ డి.వై చంద్రచూడ్ పదవీ కాలం ముగియడంతో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల బాండ్లు, ఆర్టికల్ 370 వంటి కేసుల్లో కీలక తీర్పునిచ్చిన సంజీవ్ ఖన్నా దేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఈ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో చేయనున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆరేళ్ల పాటు 117 తీర్పులు రాసిన సంజీవ్ ఖన్నా వచ్చే ఏడాది మే 13 వరకు సీజేఐగా ఉంటారు. ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై.. కుటుంబమంతా న్యాయమూర్తులే.. జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయమూర్తుల కుటుంబం నుంచే వచ్చారు. అతని తండ్రి దేవరాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయగా, పెద్దనాన్న హెచ్.ఆర్.ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1983లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అలా 2005లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పుల్లో జస్టిస్ ఖన్నా కూడా ఒక సభ్యుడు. ఎలక్టోరల్ బాండ్ల పథకం రద్దు, ఆర్టికల్ 370 రద్దు వంటి వాటిలో కీలక తీర్పు ఇచ్చారు. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనీ లాండరింగ్ కేసులో కూడా అతనికి మధ్యంతర బెయిర్ మంజూరు చేశారు. ఇది కూడా చూడండి: ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. యువకుడు చేసిన పనికి అంతా షాక్! జస్టిస్ సంజీవ్ ఖన్నా తన పెద్దనాన్న జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా తీర్పులతో స్ఫూర్తి పొందారట. తండ్రి అకౌంటెంట్‌లోకి పంపించాలనుకున్నా.. కానీ న్యాయవృత్తి మీద ఆసక్తితో ఇందులోకి రావడానికి ఇష్టపడ్డారు. ఇది కూడా చూడండి: Alert: హైదరాబాద్ వాసులు బి అలెర్ట్...ఈ ఏరియాల్లో వాటర్ బంద్! #Justice Sanjeev Khanna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి