Supreme Court: మాజీ CJI చంద్రచూడ్‌కి బిగ్ షాక్.. కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ

సుప్రీంకోర్టు మాజీ CJI డీవై చంద్రచూడ్‌ ఇప్పటి వరకు ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. సీజేఐ గడువు ముగిసినా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో ఆ బిల్డింగ్ స్వాధీనం చేసుకోవాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు యంత్రాంగం లేఖ రాసింది.

New Update
Supreme Court chandrachud

కేంద్రానికి సుప్రీంకోర్టు యంత్రాంగం లేఖ రాసింది. భారత న్యాయవ్యవస్థలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక అరుదైన పరిణామం చోటుచేసుకున్నది. సుప్రీంకోర్టు మాజీ CJI డీవై చంద్రచూడ్‌ గతేడాది నవంబర్‌లో పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. అయినా ఇప్పటి వరకు ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. దీన్ని సుప్రీంకోర్టు యంత్రాంగం స్పందించింది. సీజేఐ గడువు ముగిసినా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో ఆ బిల్డింగ్ స్వాధీనం చేసుకోవాలంటూ కేంద్రానికి అధికారికంగా లేఖ రాసింది. ఢిల్లీలోని కృష్ణా మీనన్ మార్గ్‌లో ఉన్న 5వ నంబర్ అధికారిక నివాసం సీజేఐకి కేటాయించడం ఆనవాయితీగా వస్తున్నది.

ఇప్పటికీ ఆయన అదే బంగ్లాలో నివాసం ఉంటూ వస్తున్నారు. నిబంధనల ప్రకారం పదవీ విరమణ తర్వాత భవనంలో ఉంటేందుకు ఆరు నెలల గడువు మాత్రమే ఉంటుంది. ఆయనకు మే 10తో గడువు ముగిసింది. ప్రత్యేక అనుమతితో మే 31 వరకు పొడిగించినా బంగ్లాను ఖాళీ చేయలేదు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు యంత్రాంగం జూలై ఒకటి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. జస్టిస్‌ చంద్రచూడ్‌ నుంచి బంగ్లాను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు లేఖలో స్పష్టం చేసింది. తప్పనిసరి వ్యక్తిగత కారణాలతో ఆలస్యమైందని జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పందించారు. అనువుగా ఉండే ఇల్లు చూసుకునేందుకు కొంత సమయం పట్టిందన్నారు. 

Advertisment
తాజా కథనాలు