BREAKING NEWS : సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.  స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ గత వైసీపీ ప్రభుత్వం ధాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.

New Update
chandrababu supreme court

chandrababu supreme court Photograph: (chandrababu supreme court )

ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.  స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ గత వైసీపీ ప్రభుత్వం ధాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్‌ ఫైల్‌ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గి కోర్టుకు తెలిపారు. అందువల్ల బెయిల్‌ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది.

అయితే అవసరమైన సందర్భంలో మాత్రం విచారణకు హజరై సహకరించాలని చంద్రబాబుకు సూచించింది.  కాగా ఈ కేసులో 2023 నవంబర్ లో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది.   అయితే బెయిల్‌ను రద్దు చేయాలంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది.  తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్‌ రద్దు పిటిషన్‌‌ను డిస్మిస్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని ఇంటర్‌లొకేటరీ  అప్లికేషన్‌ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక జర్నలిస్టు బాలగంగాధర్‌ తిలక్‌ పై సుప్రీంకోర్టు మండిపడింది.  మీరెవరు, మీకేం సంబంధం, పిల్‌ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.  బెయిల్‌ వ్యవహారాల్లో మూడో వ్యక్తి (థర్డ్‌ పార్టీ) ఎందుకు ఉంటారని ధర్మాసనం ప్రశ్నించింది.  ఇది ఇంకోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని జర్నలిస్టుని హెచ్చరించింది.  

52 రోజుల తరువాత  బెయిల్ పై

కాగా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో  స్కిల్ డెవలప్‌మెంట్ కేసు  కలకలం సృష్టించింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చంద్రబాబు తప్పు చేయకపోయినా కావాలనే ఆయనను అరెస్ట్ చేశారంటూ  నిరసనలు చేశారు. దాదాపు 52 రోజుల తరువాత జైలు నుండి బెయిల్ పై చంద్రబాబు విడుదల అయ్యారు. అప్పటినుంచి కేసు నడుస్తూనే ఉంది. 

Also Read :  కేటీఆర్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

Advertisment
తాజా కథనాలు