Sunetra Pawar : డిప్యూటీ సీఎంగా  నేడు సునేత్రా పవార్ ప్రమాణం.. మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రికార్డు!

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్  ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ పదవిని చేపట్టేందుకు ఆమె అంగీకరించారు.

New Update
ajith  pawar

మహారాష్ట్ర(maharashtra) ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్(Sunetra Pawar)  ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ పదవిని చేపట్టేందుకు ఆమె అంగీకరించారు. డిప్యూటీ సీఎంతో పాటుగా ఆమెకు ఎక్సైజ్, క్రీడల శాఖలను కూడా అప్పగించనున్నారు. ఫిబ్రవరి 7న జరగనున్న పుణే జిల్లా పరిషత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీని బలోపేతం చేసేందుకు ఆమెకు ఈ పదవిని కట్టబెట్టారు. పార్టీ నేతల ప్రతిపాదనపై పవార్ కుటుంబ సభ్యులందరూ చర్చించుకున్న తర్వాతే సునేత్ర పవార్ ఈ బాధ్యతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దీంతో ఆమె మహారాష్ట్ర మొదటి మహిళా ఉప ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించబోతున్నారు.

మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నందున ఆర్థిక శాఖను మాత్రం తాత్కాలికంగా సీఎం ఫడ్నవీస్ వద్దనే ఉంటుందని, కానీ తరువాత అది ఎన్‌సిపికి వెళ్తుందని ఎన్‌సిపి వర్గాలు వెల్లడించాయి. శనివారం సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  ముఖ్యమంత్రితో పాటు  మంత్రులు హాజరు కానున్నారు.  

కాగా బుధవారం ఉదయం పూణే జిల్లాలోని బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో భాగంగా అజిత్ పవార్(ajith-pawar) ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో 66 ఏళ్ల ఆయన ఆ ప్రమాదంలో మరణించారు. విమానం రన్‌వే ఎంట్రీ దగ్గర కూలిపోవడంతో చార్టర్డ్ విమానంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు కూడా మరణించారు. మృతుల్లో ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఒక విమాన సహాయకురాలు,  ఇద్దరు పైలట్లు ఉన్నారు.

Also Read :  సైబర్ నేరాలు.. కోటిన్నర మొబైల్‌ నంబర్లు బ్లాక్‌ చేసిన కేంద్రం

ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు

గురువారం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు జరిగాయి, అక్కడ ఆయన కుమారులు చితికి నిప్పంటించి, అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఎన్‌సిపి (ఎస్‌సిపి) చీఫ్ శరద్ పవార్, నటుడు రితేష్ దేశ్‌ముఖ్ సహా పలువురు ప్రముఖ నాయకులు, ప్రముఖులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు.

సునేత్ర పవార్ 1963, అక్టోబర్ 18న మహారాష్ట్రలోని ధారాశివ్ (పాత పేరు ఉస్మానాబాద్) జిల్లాలో జన్మించారు. 1985లో అజిత్ పవార్‌తో ఆమె వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, పార్థ్ పవార్, జయ్ పవార్. ఆమె ప్రస్తుతం ఎన్సీపీ (NCP) తరపున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు (జూన్ 2024లో ఎన్నికయ్యారు).

2024 లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుండి తన వదిన సుప్రియా సూలేపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయినప్పటికీ, పార్టీలో బలమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు.

Also Read :  అన్ని స్కూళ్లలో టాయిలెట్లు, బాలికలకు ఫ్రీగా శానిటరీ ప్యాడ్లు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు