/rtv/media/media_files/2025/10/09/srisan-pharma-owner-2025-10-09-07-30-22.jpg)
మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లాలో కలుషితమైన దగ్గు సిరప్ తీసుకుని పదుల సంఖ్యలో చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో మరణించిన చిన్నారుల సంఖ్య 20కి చేరింది. దీనికి కారణమైన 'కోల్డ్రిఫ్' దగ్గు సిరప్‌ను తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసింది. మధ్యప్రదేశ్ పోలీసులు శ్రీసన్ ఫార్మా కంపెనీ ఓనర్‌ని గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. శ్రీసన్ ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్లు మూడు రోజుల నుంచి పరారీలో ఉన్నారు.
S Ranganathan, the owner of the Sresan Pharma in Tamil Nadu, has been arrested amid the cough syrup-related child deaths in Madhya Pradesh.
— Vani Mehrotra (@vani_mehrotra) October 9, 2025
Ranganathan was arrested in Chennai after the Madhya Pradesh Police had dispatched a team to the city and to Kanchipuram to arrest him.… pic.twitter.com/shvkROIvgx
చిన్నారులకు ఈ కలుషితమైన సిరప్‌ను సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనిని ఇప్పటికే అరెస్టు చేశారు. దీంతో పాటు, సిరప్ తయారీకి బాధ్యులైన తమిళనాడులోని కాంచీపురం కేంద్రంగా పనిచేస్తున్న శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ డైరెక్టర్లు, ఇతర బాధ్యులపై కేసు నమోదు చేశారు. కోల్డ్రిఫ్ సిరప్‌లో అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ అధిక మోతాదులో ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.
డైఇథైలిన్ గ్లైకాల్ (DEG)తో కలుషితం:
తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టరేట్, అలాగే మధ్యప్రదేశ్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీ నిర్వహించిన పరీక్షల్లో 'కోల్డ్రిఫ్' సిరప్‌లో 46% నుంచి 48% వరకు డైఇథైలిన్ గ్లైకాల్ ఉన్నట్లు నిర్ధారించారు. యాంటీ-ఫ్రీజ్, బ్రేక్ ఫ్లూయిడ్‌లలో ఉపయోగించే ఈ విషపూరిత రసాయనం, సేవించిన చిన్నారుల కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడానికి కారణమైంది. ఈ విషాదంలో మరణించిన చిన్నారుల సంఖ్య 14కు పైగా పెరిగినట్లు సమాచారం.
ఈ ఘటనతో మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు 'కోల్డ్రిఫ్' సిరప్ అమ్మకాలను తక్షణమే నిలిపివేసి, స్టాకును సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా దేశవ్యాప్తంగా దగ్గు సిరప్‌ల నాణ్యత, సరైన వినియోగంపై కఠినమైన చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసులో శ్రీసన్ ఫార్మా కంపెనీపై క్రిమినల్ చర్యలు కొనసాగుతున్నాయి.