Space X: స్పేస్‌ఎక్స్‌తో జతకట్టనున్న ఇస్రో.. ఎందుకంటే ?

ఇటీవల వరుస విజయాలతో దూకుడు మీదున్న ఇస్రో.. మొదటిసారిగా ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ సాయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ సాయంతో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

New Update
ISROO

త్వరలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) నింగిలోకి శాటిలైట్‌ను పంపనుంది. ఇటీవల వరుస విజయాలతో దూకుడు మీదున్న ఇస్రో.. మొదటిసారిగా ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ సాయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ సాయంతో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే ఇటీవల పలు దేశాలకు చెందిన శాటిలైట్లను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెడుతూ.. ఇస్రో భారీగానే ఆదాయం ఆర్జిస్తోంది.

Also Read : తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడితో 'పవన్' హీరోయిన్ డేటింగ్.. అతని కౌగిలిలో ఒదిగిపోతూ

Space X

ఇప్పుడు ఇస్రో భారత్‌కు చెందిన శాటిలైట్‌ను స్పేస్‌లోకి తీసుకెళ్లేందుకు స్పేస్‌ఎక్స్‌ సంస్థ సాయం కోరుతోంది. ఇస్రో.. మార్క్‌-3 ద్వారా భారీ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్తోంది. అయితే మార్క్‌-3 రాకెట్‌కు.. 4 వేల కిలోలున్న ఉపగ్రహాలను మాత్రమే భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టే సామార్థ్యం ఉంది. కానీ ఇస్రో కమ్మూనికేషన్‌ శాటిలైట్‌ అయిన జీశాట్‌ ఎన్‌2ని స్పేస్‌లోకి పంపించాల్సి ఉంది. 

Also Read: వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఖతం.. మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

అయితే ఈ రాకెట్ బరువు 4700 కిలోల బరువు ఉంటుంది. అందుకే ఇస్రో స్పేస్‌ఎక్స్‌ కంపెనీ సాయం కోరుతోంది. ఈ క్రమంలోనే స్పేస్‌ఎక్స్‌కి చెందిన ఫాల్కన్-9 రాకెట్‌.. జీశాట్-ఎన్‌2 శాటిలైట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ను ఉపయోగించుకొని ఇస్రో చేపడుతున్న తొలి వాణిజ్యపరమైన శాటిలైట్ ప్రయోగం ఇదే కావడం విశేషం. ఇదిలాఉండగా.. జీశాట్-ఎన్‌2 శాటిలైట్‌ విమానాల్లో ఇంటర్నేట్ సిగ్నల్స్ అందించేందుకు సాయం చేస్తుంది. అంతేకాదు భారత్‌లోని మారుమూలు ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్‌ను విస్తరిస్తుంది.      

Also Read : Prakasam District: బస్సులో రెచ్చిపోయిన తాగుబోతు.. మహిళా కండక్టర్ పై...

Also Read: మావోయిస్టుల కోసం గాలింపులు.. అమరవీరుల స్తూపాలు కూల్చివేత

Advertisment
Advertisment
తాజా కథనాలు