/rtv/media/media_files/2025/04/19/EgVYiP5t6jOYfocUlqSr.jpg)
US Visa, Passport
ప్రతీ ఏడో దాదాపు 5 నుంచి 6 వేల మంది అమెరికా పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. వీరందరూ ఇతర దేశాల్లో ఉంటున్నవారు. గ్రీన్ బ్యాక్ సర్వే ప్రకారం విదేశాల్లో ఉన్న అమెరికన్లు దాదాపు సగం మంది తమ సిటిజెన్‌షిస్‌ను వదులకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 2004లో ఈ సంఖ్య 30శాతం ఉండగా..2025లో ఇది 49 శాతానికి పెరిగింది. ఈ సర్వేలో దాదాపు 1100 మంది అడగ్గా..అమెరికాలో పన్నుల విధానం, రాజకీయాలు లాంటి అంశాల వల్లనే తాము ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
ఏటికేడు పెరుగుతున్న సంఖ్య..
విదేశాల్లో నివసిస్తున్న అనేక మంది అమెరికన్లు.. తమ దేశ పౌరసత్వాన్ని వదులుకోవడం క్రమంగా పెరుగుతోందని తెలిసింది. పన్నుల విధానం, చట్టపరమైన అంశాలకు తోడు దేశ రాజకీయాల తీరుపట్ల వీరు చాలా అసంతృప్తిగా ఉన్నారు. అన్నింటికంటే పెద్ద కారణం పన్నులు. దీనివల్ల 61శాతం మంది సిటిజెన్‌షిప్ వద్దనుకుంటున్నారు. అమెరికన్లు ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా ఏటా ఆదాయపుపన్ను రిటర్ను దాఖలు చేయాల్సిందే. లేదంటే జరిమానాలు ఉంటాయి. దీని వలన తాము సుఖంగా ఉండలేకపోతున్నామని చెబుతున్నారు. దీంతో పాటూ లాజిస్టికల్ సమస్యలు కూడా వీరిని ఇబ్బంది పడుతున్నాయి. పన్నులు తర్వాత అమెరికా రాజకీయాల కారణంగా 5శాం మంది పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. ముఖ్యంగా ట్రంప్ వచ్చాక దీనిపై మరింత అసంతృప్తి మరింత పెరిగిందని చెబుతున్నారు. ఈ రెండిటితో పాటూ క్యాపిటల్ భవనం అల్లర్లు, గ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోవడం, ఓటింగ్ హక్కు కోల్పోవడం వంటి అంశాలు కూడా అమెరికన్లు తమ పౌరసత్వాన్ని వదులుకోవాలనే నిర్ణయం వైపు నడిపిస్తున్నాయి. మొత్తానికి ఎలా చూసినా అంటే దేశంలోనూ, దేశం బయట కూడా అసంతృప్తి కనిపిస్తోంది. అగ్రరాజ్యం ఇప్పటికే తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇది ఇక మీదట మరింత దిగజారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని చెబుతున్నారు.
Also Read: జమ్మూ-కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే..యూఎన్‌లో మరోసారి స్పష్టం
Follow Us