సాధారణంగా పామును చూస్తే కొందరు భయంతో పరుగులు తీస్తారు. వ్యవసాయ క్షేత్రాల్లో, చెట్ల పొదల్లోనే కాదు.. అప్పుడప్పుడు పలువురి ఇళ్లల్లోకి కూడా పాములు దూరుతుంటాయి. కొంతరైతే పామును చూశాక చంపేస్తుంటారు కూడా. మరికొందరు అడవిలోకి వదిలేస్తుంటారు. అయితే మహారాష్ట్రలో మాత్రం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా నడుస్తున్న రైల్లోనే ఒక్కసారిగా పాము ప్రత్యక్షమయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జబల్‌పుర్- ముంబయి గరీబ్‌రత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Also Read: ఆహారంలో బతికి ఉన్న ఎలుక...విమానం అత్యవసర ల్యాండింగ్!
ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గరీబ్‌రత్ అనే ఎక్స్‌ప్రెస్ రైలు జబల్‌పుర్ నుంచి ముంబయికి బయలుదేరింది. అయితే మహారాష్ట్రలోని కాసర రైల్వే స్టేషన్‌ను రైలు చేరుకునే సమయంలో ఏసీ కోచ్ జీ-3లో ఒక్కసారిలో పాము ప్రత్యక్షమైంది. పైన బెర్త్ హ్యాండిల్‌కు చుట్టుకొని కాసేపు అలాగే ఉండిపోయింది. దాన్ని చూసి భయపడ్డ ప్రయణికులు వేరే కోచ్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఆ పామును పట్టుకొని బయట వదిలేశామని స్పష్టం చేశారు.