Flight Meal : ఆహారంలో బతికి ఉన్న ఎలుక...విమానం అత్యవసర ల్యాండింగ్‌!

ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మలాగాకు వెళుతున్న విమానంలో ఓ మహిళ పాసింజర్‌ తన ఫుడ్‌ పార్మిల్‌ ఓపెన్‌ చేయగా..అందులో బతికి ఉన్న ఎలుక బయటకు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది.

author-image
By Bhavana
New Update
Flight: విమానం గాల్లో ఉండగా మంటలు..భయాందోళనలో ప్రయాణికులు!

Emergency Landing: విమాన ప్రయాణంలో ఓ ప్యాసింజర్ కి బాగా ఆకలి వేయడంతో విమాన సిబ్బంది ఇచ్చిన ఫుడ్ పార్శిల్‌ను ఓపెన్ చేయగా ఓ షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. పార్శిల్‌ అలా తెరవగానే ఆ ఆహార పొట్లం నుంచి ఓ బతికి ఉన్న ఎలుక ఒకటి బయటకు దూకింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాకై ఈ విషయం గురించి ఫ్లైట్‌ సిబ్బందికి తెలియజేయగా..వారు ప్రోటోకాల్‌ ప్రకారం విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. 

 బుధవారం స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌కు (ఎస్ఏఎస్) చెందిన ఓ విమానం నార్వేలోని ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మలాగాకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. విమానాన్ని డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. విమానంలో ఎలుకలు కనిపించినప్పుడు అనుసరించాల్సిన నిబంధనల ప్రకారం అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తారని స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు. 

ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని, అలాంటి సందర్భం ఎదురైనప్పుడు నిబంధలను కచ్చితంగా పాటిస్తామని అని ఆయన వివరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై విమానాన్ని తయారు చేసిన కంపెనీతో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. విమానంలోని విద్యుత్ వైర్లను కొరికివేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రయాణం మధ్యలో ఎలుకలు కనిపించినప్పుడు ఈ ప్రొటోకాల్‌ పాటిస్తారని సమాచారం. 

కాగా విమానాన్ని కోపెన్‌హాగన్‌లో ల్యాండింగ్ చేసిన వెంటనే ఎలుకను పట్టుకునేందుకు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. 

Also Read :  శ్రీవారి ఆలయంలో నేడు శాంతి హోమం!

Advertisment
Advertisment
తాజా కథనాలు