INDIA-PAK WAR: చండీగఢ్‌లో మోగిన సైరన్లు. అప్రమత్తమైన సైన్యం

పాక్‌ ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం మొదలైంది. ఈ క్రమలోనే చండీగఢ్‌లో  వైమానిక దళం సైరన్‌ మోగించి  అప్రమత్తం చేసింది. ఇళ్లు వదిలి బయటకు రావద్దని సూచించింది.

New Update

INDIA-PAK WAR : పాక్‌ ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో పాకిస్థాన్‌ తీవ్రంగా నష్టపోతుంది. అయినా సరిహద్దు రాష్ట్రాల్లోపాకిస్థాన్‌ డ్రోన్లు, క్షిపణిలతో దాడులు చేస్తోంది. వాటిని భారత్‌ సమర్థవంతంగా కూల్చివేసింది. ఈ క్రమలోనే చండీగఢ్‌లో  వైమానిక దళం సైరన్‌ మోగించి  అప్రమత్తం చేసింది. ఏ క్షణమైన దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు బాల్కనీలకు దూరంగా ఇళ్లలోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లు వదిలి బయటకు రావద్దని సూచించింది.

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

 మరోవైపు సరిహద్దు రాష్ట్రాల్లోనూ సైరన్‌లు మోగుతున్నాయి. జమ్ములోనూ ఈ ఉదయం సైరన్లు మోగాయి. మరోవైపు రెండు దేశాల మధ్య సరిహద్దులుగా ఉన్న పలు రాష్ర్టాల ప్రజలను అప్రమత్తం చేశారు.  సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో  విద్యుత్‌ అంతరాయ ఏర్పడడంతో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. అయితే భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వాటిని సమర్ధవంతంగా, సంపూర్ణంగా అడ్డుకుని కూల్చివేస్తున్నాయి.

ఇది కూడా చూడండి:BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

 భారత సైన్యాలు  జమ్మూ యూనివర్శిటీ వద్ద రెండు డ్రోన్లను కూల్చి వేశాయి. అలాగే సత్వారిలోని జమ్మూ విమానాశ్రయం సహా సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పాక్ 8 క్షిపణుల దాడులు చేసింది. వాటిని భారత్ ఎయిర్, డిఫెన్స్ వ్యవస్థలు సమర్ధవంతంగా అడ్డుకున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

Advertisment
తాజా కథనాలు