AP: అయ్యప్ప భక్తులకు తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు! ఏపీ శ్రీకాకుళం జిల్లా కు చెందిన కొందరు అయ్యప్ప స్వాములు శబరిమల దర్శనానికి వెళ్లారు.దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో.. వారు వెళ్లిన బస్సుకు ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. By Bhavana 04 Dec 2024 in నేషనల్ ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి AP: ఏపీ శ్రీకాకుళానికి చెందిన అయ్యప్ప భక్తులకు పెను ప్రమాదం తప్పింది. అయ్యప్ప భక్తులు వెళ్లిన బస్సుకు పెద్ద ప్రమాదమే జరిగింది. బస్సులో మంటలు చెలరేగి బస్సు ఒక్కసారిగా పూర్తిగా కాలిపోయింది. అయితే ఈ ఘటనలో అయ్యప్ప భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. Also Read: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ జిల్లాల్లో వైన్‌షాప్‌లు బంద్! అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం మజ్జిరాముడుపేటకు చెందిన 41 మంది అయ్యప్ప స్వాములు ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సును అద్దెకు తీసుకుని శబరిమలకు వెళ్లారు. నవంబర్ 25వ తేదీన శబరిమలకు బయల్దేరారు. శబరిమల అయ్యప్ప దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. అయితే తమిళనాడులోని కంచి సమీపంలో వంట చేసుకోవడానికి బస్సును రోడ్డు పక్కకి ఆపారు. బస్సును ఆపి రోడ్డు పక్కన వంట చేసుకుంటున్న సమయంలో.. అకస్మాత్తుగా బస్సులో మంటలు చెలరేగాయి. Also Read: గోదావరి-కావేరి నీటిలో సగం వాటా ఇవ్వాల్సిందే: తెలంగాణ ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులోపల ఉంచిన అయ్యప్ప స్వాముల సామాగ్రి, దుస్తులు, ప్రసాదాలు అన్ని బూడిదయ్యాయి. అయితే ప్రమాద సమయంలో స్వాములు అంతా కూడా బయటే ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక మంటల్లో బస్సు కాలిపోయిన విషయాన్ని స్వాములు.. సదరు ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీకి చెప్పారు. దీంతో కంచి నుంచి వారికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో స్వాములు అందరూ శ్రీకాకుళానికి తిరిగి పయనమయ్యారు. Also Read:Lokesh: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఇక నుంచి మధ్యాహ్నా భోజనం నిప్పు రవ్వలు ఎగసిపడటంతో.. అయితే వంట చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగసిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. మంటలు చెలరేగిన వెంటనే ఆర్పడానికి ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. బస్సుతో పాటుగా అందులోని వస్తువులు అన్నీ కూడా కాలిపోయాయి. దీంతో స్వాములందరూ కట్టుబట్టలతోనే తిరుగు ప్రయాణం కావాల్సి వచ్చింది. Also Read: ApsRTc: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఏమన్నారంటే! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి