తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో మంటలు చెలరేగడంతో పది మంది శిశువులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. అయితే ఈ ప్రమాదానికి అసలు కారణం షార్ట్ సర్క్యూట్ అని అధికారులు అనుమానించారు.
Also Read: రేవంత్ ఛాలెంజ్ స్వీకరించిన కిషన్ రెడ్డి..3 నెలలు అక్కడే నిద్ర!
నర్సు నిర్లక్షమే ప్రమాదానికి కారణం
అయితే ఈ ప్రమాదంపై తాజాగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఓ నర్సు నిర్లక్షమే ఈ ప్రమాదానికి కారణం అని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. ముందుగా ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావించిన అధికారులు.. ఇప్పుడు షాకింగ్ నిజాలు బయటకు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
Also Read: పెళ్లి పేరుతో మైనర్ బాలికను తల్లిదండ్రులు.. ఏం చేశారంటే?
ICUలో హమీర్‌పూర్‌కు చెందిన భగవాన్ దాస్ కొడుకు చికిత్స పొందుతున్నాడు. అదే సమయంలో ఓ నర్సు ఆక్సిజన్ సిలిండర్ పైప్ కనెక్ట్ చేస్తుండగా మరో నర్సు అగ్గిపుల్ల వెలిగించడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. దీంతో క్షణాల్లోనే వేగంగా మంటలు వ్యాపించడంతో.. నలుగురు పిల్లలను ఎత్తుకొని బయటకు పరుగులు తీశానని తెలిపారు.
Also Read: మోదీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అధికార మహాయుతి కుటమిలో విభేదాలు
ఇతరుల సాయంతో మరికొంత మందిని కాపాడాని ఆ ప్రత్యక్షసాక్షి తెలిపారు. మంటలు వ్యాపించి పొగలు కమ్మడంతో భయంతో అందులో ఉండేవారంతా పరుగులు పెట్టారని.. అదే క్రమంలో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.
Also Read: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!
దీంతో ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ప్రమాదంలో అప్పటికే ICUలో మొత్తం 47 మంది చిన్నారులు చికిత్స తీసుకుంటున్నారు. ఇక ప్రమాద సమయంలో అందులో 10 మంది చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.