Supreme Court : ఆమేం టెర్రరిస్ట్‌ కాదు కదా.. పూజా ఖేడ్కర్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు...బెయిలుమంజూరు

మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్ (ఐఏఎస్‌) ట్రైనీ ఆఫీసర్‌ పూజాఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఆమె డ్రగ్‌ మాఫియా లేదా టెర్రరిస్టు కాదు. హత్యలు చేయలేదు. అలాంటపుడు బెయిల్‌ ఎందుకు ఇవ్వరాదు అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.

New Update
Puja Khedkar

Puja Khedkar

Supreme Court : మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్ (ఐఏఎస్‌) సర్వీస్‌ ట్రైనీ ఆఫీసర్‌ పూజా ఖేడ్కర్‌ పేరు అందరికీ తెలిసిందే. అయితే సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో తప్పుడు మార్గాల్లో ఓబీసీ, డిసేబిలిటీ కోటా కింద ప్రయోజనాలు పొందారని ఆమెమీదా ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆమెకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.  కేసులో ఆమెకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే గతంలో ఆమెకు ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు పూజా ఖేడ్కర్‌ సహకరించడం లేదని న్యాయవాదులు ఆరోపించారు. అయితే  సహకరించకపోవడం అంటే ఏమిటి, దేని గురించి అని ప్రశ్నించిన జస్టిస్‌ బి.వి. నాగరత్న ఆమె హత్య చేయలేదని, డ్రగ్స్‌ దందా చేయలేదని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: TG JOBS: గ్రూప్‌‌ 3, 4 పరీక్షల్లో కీలక మార్పులు.. మరో 27 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

'ఆమెకు బెయిల్‌ ఇవ్వకపోవడానికి అంతపెద్ద తప్పు ఏమి చేసింది? ఆమె మాదకద్రవ్యాల కింగ్‌పిన్  కాదు. ఈ కేసు డ్రగ్‌ నేరం కిందకు రాదు. ఆమె డ్రగ్‌ మాఫియా లేదా  టెర్రరిస్టు కాదు. ఆమె 302 హత్యలు చేయలేదు. అలాంటపుడు బెయిల్‌ ఎందుకు ఇవ్వరాదు అని ప్రశ్నించింది.ఆమె విచారణకు సహకరిస్తుందని వెల్లడించిన జస్టిస్‌ ఎక్కడ నుంచి నకిలీ సర్టిఫికెట్‌ పొందారో వెల్లడించాలని, ఆమెను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.ముందు విచారణ పూర్తి చేయండి. ఆమె అన్నీ కోల్పోయారు, ఎక్కడా ఆమెకు ఉద్యోగం కూడా లేదు'' అని బెంచ్ అభిప్రాయపడింది.

Also Read: 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!

కాగా, ఖేడ్కర్‌కు ముందస్తు బెయిలు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఖేడ్కర్‌ విచారణకు సహకరించడం లేదని ఆమెకు బెయిల్‌ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తుందని ఆరోపించారు. ఆమెపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని కోర్టుకు విన్నవించారు. అయితే దర్యాప్తునకు సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని న్యాయమూర్తులు బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పూజా ఖేడ్కర్‌ను ఆదేశించింది.  అంతేకాక , ఆమెను రూ. 35,000 నగదు పూచీకత్తు అందించే షరతుపై బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Rajiv Gandhi: రాజీవ్ గాంధీ చనిపోయేముందు ఏం జరిగిందో తెలుసా ?

Advertisment
తాజా కథనాలు