CHANDRABABU CASES: మూడు కోర్టుల్లో చంద్రబాబు కేసుల మీద నేడు విచారణ.. టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ
ఏసీబీ కోర్టులో చంద్రబాబు కేసు మీద ఈ రోజు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టు సమయంలో సిఐడి అధికారుల కాల్ రికార్డ్ ఇవ్వాలంటు చంద్రబాబు తరుపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్నారు. దీని మీద ఈ రోజు కూడా ఇరు వర్గాల తరుఫు లాయర్లు వాదించనున్నారు. ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ తరువాత ఏసీబీ కోర్టు జడ్జిలు తీర్పును ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు హైకోర్టులో అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కూడా నేడు తీర్పు రానుంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి