108 దేశాలు.. 12 వేలమంది బాలికలు.. చంద్రయాన్‌-4 కి సిద్ధం

చంద్రయాన్‌- 4 పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఏరోస్పేస్ అంకుర సంస్థ అయిన 'స్పేస్ కిడ్జ్ ఇండియా' ముందుకొచ్చింది. మొత్తం 108 దేశాలకు చెందిన 12 వేల మంది బాలికలకు స్పేస్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది.

satellite
New Update

భారత్ ప్రయోగించిన చంద్రాయన్ -3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయ్యి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రయాన్-4  మిషన్‌కి సంబంధించి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఏరోస్పేస్ అంకుర సంస్థ అయిన 'స్పేస్ కిడ్జ్ ఇండియా' ముందుకొచ్చింది. మొత్తం 108 దేశాలకు చెందిన 12 వేల మంది బాలికలకు స్పేస్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం శక్తిశాట్ అనే మిషన్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించి అధికార పోస్టర్‌న కూడా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు స్పేస్ కిడ్జ్ ఇండియా తెలిపింది.  

Also Read: కళ్ల ముందే కదులుతున్న కారు దగ్ధం.. డ్రైవర్ ఏం చేశాడంటే? వీడియో వైరల్

శాటిలైట్ ప్రయోగించడమే మా టార్గెట్

'' శక్తిశాట్ మిషన్ కింద 108 దేశాలకు చెందిన 14 -18 ఏళ్ల వయసున్న హైస్కూల్ విద్యార్థినులకు 12 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నాం. స్పేస్ టెక్నాలజీ, పేలోడ్ అభివృద్ధి, అలాగే వ్యోమనౌక వ్యవస్థల గురించి ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తాం. యూఏఈ, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, కెన్యా, గ్రీస్, శ్రీలంక తదితర దేశాలు ఇందులో భాగం కానున్నాయి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రతీ దేశం నుంచి ఒకరిచొప్పున 108 మందిని సెలెక్ట్ చేస్తాం. వీళ్లకి పేలోడ్‌లు, స్పేస్‌క్రాఫ్ట్ ప్రోటోటైప్‌లను తయారుచేయడంలో శిక్షణ ఇప్పిస్తాం. ఇస్రో చేపట్టబోయే చంద్రయాన్-4 మిషన్‌లో శాటిలైట్‌ను ప్రయోగించాలనే టార్గెట్ పెట్టుకున్నాం. దీనికి సంబంధించి ప్రధాని మోదీకి ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నామని'' ఈ మిషన్‌కు నేతృత్వం వహిస్తున్న కేసన్‌ ఓ వార్తాసంస్థకు వివరించారు.  

Also Read: సిద్ధిఖీ హత్య...కన్నీటిపర్యంతమైన శిల్పాశెట్టి!

శక్తిశాట్ మిషన్‌ అనేది భారత్‌కి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికే ప్రయోజనం చేకూర్చే సామర్థ్యం కలిగి ఉందని కేసన్ పేర్కొన్నారు. బాలికలను ప్రోత్సహించి వాళ్లలో సాధికారతను నింపడం, వారి జీవితాలను మార్చేసే అవకాశాలను అందించడమే తమ ప్రాధాన్యమని తెలిపారు. ఇదిలాఉండగా.. స్పేస్ కిడ్జ్ ఇండియా ఇప్పటిదాకా 18కిపైగా బెలూన్ శాటిలెట్లు, మూడు సబ్‌ఆర్బిటల్ పేలోడ్‌లు, అలాగే నాలుగు ఆర్బిటల్ శాటిలైట్‌లను ప్రయోగించింది. అంతేకాదు హైస్కూల్, కళాశాల విద్యార్థుల సాయంతో శాటిలైట్లను ప్రయోగించిన మొట్టమొదటి సంస్థగా కూడా స్పేస్ కిడ్జ్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.  

 

#telugu #national #isro #space #aero-space
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe