Ramadan: రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు బీజేపీ స్పెషల్ గిఫ్ట్

రంజాన్ పండుగ సందర్భంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. 'సాగత్ ఈ మోదీ' పేరుతో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు పండగ కిట్లు అందించనుంది. అర్హులైన వారికి రంజాన్ రోజున 32 వేల మంది బీజేపీ మోర్చా కార్యకర్తలు ఈ కిట్లు చేరవేయనున్నారు.

New Update
'Saugat-e-Modi', BJP's big Muslim outreach on Eid

'Saugat-e-Modi', BJP's big Muslim outreach on Eid

రంజాన్ పండుగ సందర్భంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. 'సాగత్ ఈ మోదీ' పేరుతో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు పండగ కిట్లు అందించనుంది. అర్హులైన వారికి వీటిని రంజాన్ రోజున ఈ కిట్లు చేరేందుకు 32 వేల మంది బీజేపీ మోర్చా కార్యకర్తలు మసీదులతో సమన్వయం కానున్నారు. వీళ్లందరూ పేద ముస్లింలకు కిట్లు చేరవేసే బాధ్యత తీసుకోనున్నారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కిట్ల పంపిణీని ప్రారంభించనున్నారు. 

Also Read: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు.. మద్యం మత్తులో యువతిని ఢీ కొట్టి..!

ఈ కిట్‌లో స్త్రీ, పురుషులకు వస్త్రాలు ఉంటాయి. అలాగే సేమియా, ఖర్జూర, ఎండు ఫలాలు, చక్కెర ఇతర వస్తువులు కూడా ఉంటాయి. మార్చి 31న రంజాన్‌ పండగ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ మైనార్టీ వింగ్‌ నాయకత్వంతో దేశవ్యాప్తంగా ఈ కీట్లు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బీజేపీ మైనార్డీ వింగ్ జాతీయ అధ్యక్షుడు జమల్ సిద్దిఖీ మాట్లాడారు.  

Also Read: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

రంజాన్ సందర్భంగా బీజేపీ చేపడుతున్న ఈ కార్యక్రమం వల్ల 'సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌' అనే ప్రధాని మోదీ సందేశం దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని తెలిపారు.  అంతేకాదు సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధ మతాలకు కూడా వాళ్ల మతపరమైన పండగ రోజున బీజేపీ ఇలాంటి కార్యక్రమమే చేపడుతుందని పలువురు చెబుతున్నారు.  

Also Read: పీఎం కిసాన్‌ స్కీమ్.. అనర్హుల నుంచి రూ.416 కోట్లు రికవరీ

Also Read: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్‌ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!?

ramzan | bjp | rtv-news 

Advertisment
తాజా కథనాలు