Mohan Bhagwat: బాధ్యతాయుతమైన సమాజం ఆ మతంలోనే ఉంది: మోహన్‌ భాగవత్

హిందూ సమాజం మరింత ఐక్యంగా ఉండాలని ఆఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్‌ తెలిపారు. దేశంలో బాధ్యతాయుతమైన సమాజం ఏదైనా ఉంది అంటే అది కేవలం హిందూ సమాజం మాత్రమేనన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
RSS chief Mohan Bhagwat

RSS chief Mohan Bhagwat

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్‌ మోహన్ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఉన్న వైవిధ్యాన్ని ప్రజలు ఆమోదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే హిందూ సమాజం మరింత ఐక్యంగా ఉండాలని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లోని సాయ్‌ మైదానంలో జరిగిన ఆర్‌ఎస్ఎస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు పంచుకున్నారు. 

Also Read: గుండెపోటుతో వరుడు ఎలా మృతి చెందాడో చూడండి.. వీడియో చూస్తే గుండె పగలాల్సిందే!

'' భిన్నత్వంలో ఏకత్వ ఉంటుందనే సత్యాన్ని హిందూ సమాజం విశ్వసిస్తోంది. మనం హిందువులపైనే ఎందుకు దృష్టి పెడతామని ప్రజలు తరచుగా అడుగుతారు. దీనికి సమాధానం ఏంటంటే దేశంలో బాధ్యతాయుతమైన సమాజం ఏదైనా ఉంది అంటే అది కేవలం హిందూ సమాజం మాత్రమే.  హిందూ సమాజం మరింత ఐక్యంగా ఉండాలి. మంచి సమయాల్లో కూడా సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికి సమాజంలో ప్రజల మధ్య ఐక్యత అవసరం. దేశాన్ని పాలించిన చక్రవర్తులు, మహారాజులను ప్రజలు గుర్తుంచుకోరు.  

Also Read: అమ్మా.. అమ్మా..' గుండె పగిలేలా రోదిస్తున్న ఢిల్లీ తొక్కిసలాట బాధితులు.. ఈ దృశ్యాలు చూస్తే కన్నీళ్లే !

తండ్రి వాగ్దానాన్ని నేరవేర్చేందుకు 14 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చేసిన రాజునే గుర్తుపెట్టుకుంటారు. 200 ఏళ్లుగా మన దేశాన్ని పాలించిన బ్రిటిషు వాళ్లు దేశ ప్రజలను విడదీయాలని చూశారు. స్థానిక ప్రజలు దేశాన్ని పాలించేందుకు పనికిరారని ప్రచారం చేశారు. భారత చరిత్రను బ్రిటిష్ పాలకులు వక్రీకరించారని'' మోహన్ భాగవత్ అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ సమావేశం నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరగా పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇందుకు నిరాకరించారు. ఆ తర్వాత దీనిపై కలకత్తా పోలీసులు హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తీసుకున్నారు.       

Also Read: అంతా 15 నిమిషాల్లో జరిగిపోయింది...ఢిల్లీ తొక్కిసలాటకు కారణం అదేనా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు