అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ రికార్డు సృష్టించింది. రిలోకేటబుల్ రోబోటిక్ మానిప్యులేటర్-టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ పనితీరును ఇస్రో సక్సె్‌స్‌ఫుల్‌గా పరీక్షించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేసింది. డిసెంబర్ 30న స్పేస్ డాకింగ్ మిషన్‌కు సంబంధించి రెండు శాటిలైట్లను ఇస్రో ప్రయోగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు శాటిలైట్లు స్పేస్‌లో తిరుగుతున్నాయి. త్వరలోనే ఈ రెండు శాటిలైట్లను అంతరిక్షంలో ఇస్రో అనుసంధానం చేయనుంది.
Also Read: హైదరాబాద్ మెట్రోలో యాక్సిడెంట్.. డోర్ మధ్యలో ప్యాసింజర్ ఇరుక్కోవడంతో..!
అయితే ప్రయోగంలో భాగంగా.. వాకింగ్ రోబోటిక్ ఆర్మ్‌గా వ్యవహరించే ఆర్‌ఆర్ఎం-టీడీ పనితనాన్ని శనివారం ఇస్రో పరీక్షించింది. బేస్ పొజిషన్ నుంచి స్పేస్ రోబోటిక్ చేయి అన్‌లాక్ కావడంతో కొంత పైకి లేచిన ఈ రోబో చేయి ఆ తర్వాత తన స్థితికి వచ్చింది.
Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా?
అలాగే ఇస్రోలోని ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ (IISU) అభివృద్ధి చేసిన స్పేస్ రోబోటిక్ చేతిలో 7 కదిలే కీళ్లు ఉన్నాయి. పీఎస్4-ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంట్ మాడ్యూల్ (POEM-4) ప్లాట్‌ఫారమ్‌లోని టార్గెట్‌లకు అనుగుణంగా భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ అంతరిక్షంలో పనిచేయనుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం!
🇮🇳 #RRM_TD, India's first space robotic arm, is in action onboard #POEM4! A proud #MakeInIndia milestone in space robotics. 🚀✨ #ISRO #SpaceTech pic.twitter.com/sy3BxrtRN1
— ISRO (@isro) January 4, 2025