వాహనాదారులకు అలెర్ట్.. ఆ తప్పు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్‌ వ్యవస్థలో మార్పులు తీసుకురానుంది.

New Update
Govt plans grade-based driving licence system to encourage responsible driving

Govt plans grade-based driving licence system to encourage responsible driving

ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి అరికట్టేందుకు, అలాగే బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్‌ వ్యవస్థలో మార్పులు తీసుకురానుంది. ఇందులో కొత్తగా గ్రేడ్‌ పాయింట్ల విధానం ప్రవేశపెట్టనుంది. దీని ప్రకారం ఇకనుంచి ఎవరైనా తరచుగా రూల్స్‌ అతిక్రమిస్తే వాళ్ల లైసెన్స్‌ రద్దవుతుంది. సీఐఐ నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో కేంద్ర మంత్రి నిత్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు.   

ప్రతి సంవత్సరం 1.8 లక్షల మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారని గడ్కరీ తెలిపారు. వాహనం నడిపేటప్పుడు మొబైల్ వాడటం, ఓవర్ స్పీడ్, రాంగ్‌రూట్‌ డ్రైవింగ్, మద్యం తాగి నడపటం లాంటివి ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయని తెలిపారు.  రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఇప్పటికే వివిధ చర్యలు చేపట్టామని తెలిపారు. ట్రాఫిక్‌ రూల్స్ ఉల్లంఘించిన వాళ్లపై భారీగా పెనాల్టీలు పెంచినట్లు తెలిపారు.  

Also Read: Holi రష్..  ట్రైన్ టికెట్ దొరకదు.. బస్సు రేటు తగ్గదు.. చుక్కలు చూస్తున్న ప్రయాణికులు!

కానీ ఎన్ని రూల్స్ పెట్టినా వాహనాదారులకు చట్టం అంటే గౌరవం, భయం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తాము డ్రైవింగ్ లైసెన్స్‌కు గ్రేడ్‌ పాయింట్ల విధానాన్ని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ రూల్స్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే కొన్ని పాయింట్లను తీసేస్తారని తెలిపారు. డ్రైవింగ్‌ తప్పులు చేసి వాళ్లకున్న పాయింట్లు పోతే ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేస్తామని చెప్పారు. 

మరికొన్ని రోజుల్లోనే  ఈ విధానాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇక రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో  72 శాతం మంది 18 నుంచి 45 మధ్య వయస్సు ఉన్నవారే ఉంటున్నారని తెలిపారు. అంతేకాదు రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేయాలని పౌరులకు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైనవారికి వైద్య ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పీఎం రాహత్‌ స్కీమ్‌ ద్వారా రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్‌ చికిత్స ఉంటుందని వెల్లడించారు. 

Also Read: ఇరాన్‌పై అమెరికా యుద్దం ఇక్కడి నుంచే.. ఇజ్రాయెల్‌‌కు చేరుకున్న పన్నెండు F-22 ఫైటర్ జెట్లు

Advertisment
తాజా కథనాలు