/rtv/media/media_files/2025/07/08/tspsc-group-1-2025-07-08-11-36-20.jpg)
TSPSC Group-1
TGPSC Group-1: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు వాదనలు ముగించి తీర్పును రిజర్వులో పెట్టింది. గ్రూప్-1 మెయిన్స్‌ను టీజీపీఎస్సీ అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించింది. అయితే మూల్యాంకన ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలతో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా సిద్దిపేటకు చెందిన కె. పరశురాములుతోపాటు మరికొందరు అభ్యర్థులు టీజీపీఎస్సీ పరీక్ష తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పరీక్ష పత్రాల మూల్యాంకనంలో ప్రాతిపదిక లేదు. సమీక్ష విధానాల స్పష్టత లేదని పిటిషన్లు చెబుతున్నాయి.
పిటిషన్లను కొట్టివేయాలని కోర్టును..
విచారణ సందర్భంగా హైకోర్టు ఏప్రిల్ 17న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నియామక పత్రాలు ఇవ్వవద్దని టీజీపీఎస్సీని ఆదేశించినా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగించొచ్చని అనుమతించింది. న్యాయవాదులు విద్యాసాగర్, రచనారెడ్డి పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు. ముఖ్యంగా 3 రౌండ్ల మూల్యాంకనం మోడరేషన్ విధానం లాంటి అంశాలు గెజిట్ నోటిఫికేషన్‌లో ఎక్కడా ప్రస్తావించలేదని.. ఇది నిబంధనల ఉల్లంఘనకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ కారణంగానే కోర్టు జోక్యం అవసరమైందన్నారు. ఇక ఎంపికైన అభ్యర్థుల తరఫున న్యాయవాది లక్ష్మీనరసింహ అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఆలస్యం కావడాన్ని హైలైట్ చేస్తూ పిటిషన్లను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు.
ఇది కూడా చదవండి: శ్రీకాళహస్తిలో అర్ధరాత్రి గ్యాంగ్ వార్ కలకలం
ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిందని తదుపరి ప్రక్రియకు అనుమతించాలన్నారు. అయితే పిటిషనర్లు మాత్రం టీజీపీఎస్సీ పరీక్షను నిర్వహించిందని పారదర్శకత లేకుండా కీలకమైన పోస్టుల భర్తీ జరగడాన్ని ప్రశ్నించారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్ టికెట్లు ఇవ్వడం, బయోమెట్రిక్ అమలు విషయంలో తలెత్తిన లోపాలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తెలుగు మీడియం అభ్యర్థులను నిబంధనల ప్రకారం అర్హతలేని మూల్యాంకనదారులతో పత్రాలు దిద్దించారని.. ఇది తీవ్రమైన అసమానతలకు దారితీసిందని పిటిషనర్లు వాదించారు. ఈ వివాదంపై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు వాదనలు పూర్తిగా విని తీర్పును రిజర్వు చేసినట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: చెడు కలలతో టార్చర్‌గా ఉందా..? ఈ పని చేయడం మానేస్తే చాలా..!!
(tspsc-group-1 | tspsc group 1 notification | tspsc-group-1-updates | Latest News)