/rtv/media/media_files/2025/11/11/bihar-second-phase-elections-concludes-2025-11-11-16-59-31.jpg)
Bihar Second phase elections concludes
బీహార్‌లో రెండో విడుత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. మిగతా స్థానాల్లో 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ నమోదైంది. 20 జిల్లాల్లో 122 స్థానాలకు రెండో దశ ఎన్నికలు నిర్వహించారు. 3.70 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 45 వేలకు పైగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
Also Read: NIA చేతికి ఢిల్లీ పేలుళ్ల కేసు.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం!
నవంబర్ 6న మొదటి దశలో 18 జిల్లాల్లో 121 స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ దశలో మొత్తం 64.66 శాతం పోలింగ్ నమోదైంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉండనుంది. బీహార్‌లో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. 121 సీట్లు దాటిన పార్టీ అధికారంలోకి రానుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే, మహాగఠ్‌బంధన్ కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఓవైపు జేడీయూ చీఫ్ నీతీశ్ కుమార్, మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ హోరాహోరీగా ప్రచారాలు చేశారు. రెండు కూటములు కూడా ప్రజలను కీలక హామీలు ప్రకటించాయి. మరి బీహార్ ప్రజలు ఎవరికి అధికారం అప్పగించనున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read: ఢిల్లీ బ్లాస్ట్ వెనుక నలుగురు డాక్టర్ల కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!
Follow Us