/rtv/media/media_files/2025/08/17/rahul-gandhi-2025-08-17-07-06-39.jpg)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి నుంచి బీహార్ లో ఓటర్ అధికార యాత్రను చేపట్టనున్నారు. ససారాం నుండి ఈ యాత్ర ప్రారంభం కానుంది. 16 రోజుల పాటు 25 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. ఒక వ్యక్తికి ఒక ఓటు అని తమ విధానమని చెబుతున్న రాహుల్.. బీహార్ లో SIR(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ )ను వ్యతిరేకిస్తూ ఈ యాత్రకు రాహుల్ సిద్ధమయ్యారు. 1300 కిమీ మేర సాగే ఈ యాత్ర కొంతదూరం కాలినడకన, మరికొంతదూరం వాహనంపై హైబ్రిడ్ మోడల్ లో కీలకమైన నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగనుంది. ఈ యాత్ర ప్రధానంగా రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ప్రజలను చైతన్యపరచడం లక్ష్యంగా సాగుతోంది. ఇండియా అలయన్స్ బ్యానర్ కింద నిర్వహించబడుతున్న ఈ ప్రతిష్టాత్మక మార్చ్‌లో సీనియర్ ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌తో పాటుగా మహాఘుట్ నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ముగుస్తుంది. కాంగ్రెస్ నాయకులు ఇది ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.
🗳 Today’s Political Coincidence
— karan darda (@karandarda) August 17, 2025
📅 Sunday, 17 August 2025
🕒 3:00 PM — Sasaram, Bihar
➡️ Leader of Opposition in Lok Sabha Rahul Gandhi kicks off the “Voter Adhikar Yatra”
🎯 Purpose: Democratic Right – The Struggle to Protect ‘One Person, One Vote’
🕒 3:00 PM — New Delhi
➡️… pic.twitter.com/nXh0ujiM24
Also Read : ఎంత గొప్ప మనసయ్యా.. రూ.13వేల కోట్లు విరాళమిచ్చిన వ్యాపారవేత్త
ఓటరు హక్కు యాత్ర షెడ్యూల్:
ఆగస్ట్ 17 - ససారం, రోహ్తాస్ (యాత్ర ప్రారంభం)
ఆగస్ట్ 18 - దేవ్ రోడ్, అంబా-కుందుంబ
ఆగస్టు 19 – హనుమాన్ మందిర్, పూనం, వజీర్‌గంజ్
ఆగస్టు 20 - విశ్రాంతి దినం
ఆగస్టు 21 - తీన్ మోహని దుర్గా మందిర్, షేక్‌పురా
ఆగస్టు 22 – చంద్ర బాగ్ చౌక్, ముంగేర్
ఆగస్టు 23 - కుర్సేలా చౌక్, బరారి, కతిహార్
ఆగస్టు 24 - ఖుష్కీబాగ్, కతిహార్ నుండి పూర్నియా వరకు
ఆగస్టు 25 - విశ్రాంతి దినం
ఆగష్టు 26 - హుస్సేన్ చౌక్, సుపాల్
ఆగస్టు 27 - గంగ్వారా మహావీర్ స్థాన్, దర్భంగా
ఆగస్టు 28 - రిగా రోడ్, సీతామర్హి
ఆగష్టు 29 - హరివాటికా గాంధీ చౌక్, బెట్టియా
ఆగస్టు 30 - ఎక్మా చౌక్, ఎక్మా విధానసభ, ఛప్రా
ఆగస్టు 31 - విశ్రాంతి దినం
సెప్టెంబర్ 1 - పాట్నాలో గ్రాండ్ ఫినాలే ర్యాలీ
Also Read : Udaya Bhanu : రెమ్యూనరేషన్ అడిగితే బ్యాడ్ గా ప్రచారం చేశారు.. ఉదయభాను సంచలన కామెంట్స్