King Nagarjuna: తమిళ తంబీల మనసు దోచుకున్న కింగ్ నాగార్జున

మన్మథుడు నాగార్జునకు తెలుగు, హిందీ ప్రేక్షకులు మొదటి నుంచీ ఫిదా నే. ఇప్పుడు తమిళ తంబీలు కూడా కింగ్ కు ఫ్యాన్స్ అయిపోయారు. కూలీ లో విలన్ రూల్ చేసిన నాగార్జున స్టైలిష్ లుక్ కు మెస్మరైజ్ అయిపోయారని చెబుతున్నారు. 

New Update
Nagarjuna as Simon

Nagarjuna as Simon

కింగ్ నాగార్జున వయసు ప్రస్తుతం 66 ఏళ్ళు. కానీ ఇప్పటికీ ఆయన స్టైల్, ఛార్మ్ ను బీట్ చేసేది ఎవరూ లేరు అంటే అతిశయోక్తి కాదేమో. కుర్ర హీరోలు సైతం నాగార్జున అందం ముందు ఓడిపోతారు. ఇప్పటికీ ప్రతీ హీరోయిన్ ఆయనతో యాక్ట్ చేయాలనుకుంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్ అవుతున్న నాగార్జునకు ఇప్పుడు కొత్త ఫ్యాన్ పుట్టుకొచ్చారు.  తెలుగు సినిమా ప్రేక్షకులు గత 25 ఏళ్ళుగా నాగార్జునకు ఫ్యాన్స్ గానే ఉన్నారు. వీళ్ళకు తోడు హిందీ ఆడియన్స్ కూడా ఆయనకు బిగ్ ఫ్యాన్స్. ఇప్పుడు ఈ లిస్ట్ లో తమిళ తంబీలు కూడా చేరారు. 

హీరోగా రాని క్రేజ్ విలతన్ గా ఒక్క సినిమాతో..

నాగార్జున రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమాలో చేశారు. ఇందులో రజనీకాంత్ హీరోగా చేస్తే...కింగ్ విలన్ గా చేశారు. అయితే లోకేష్ నాగార్జున పాత్రను రజనీకాంత్ తో ఈక్వల్ గా డిజైన్ చేశారు. సైమన్ పాత్రలో ఆయన చాలా స్టైలిష్ గా ఉన్నారు. సినిమాపై మొదటి నుంచీ మిక్సడ్ టాక్ నడిచింది. కానీ నాగార్జున క్యారెక్టర్ ను మాత్రం అందరూ పొగుడుతూనే ఉన్నారు. ఇప్పుడు తమిళ తంబీలు కూడా ఆయనకు ఫిదా అయిపోయారని తెలుస్తోంది. విలనిజాన్ని కూడా స్వాగ్ అండ్ స్టైల్ తో అదరగొట్టారు నాగార్జున. అందుకే ఆయనకు బిగ్ ఫ్యాన్ అయిపోయారు తమిళయన్స్. 

ప్రస్తుతం సైమన్ పాత్రను ట్రెండ్ చేస్తున్నారు తమిళయన్లు. సోషల్ మీడియాల్లో నాగార్జున ఫోటోలను, మూవీ క్లిప్పింగ్స్ ను పెడుతూ ఫుల్ హల్ చల్ చేస్తున్నారు. నాగార్జున తన సినిమాల్లో హీరోగా చేసిన దాని కంటే సైమన్ పాత్రలో చాలా స్టైలిష్ గా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. సైమన్ పాత్ర ఆయన కోసమే పుట్టిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ వయసులో కూడా నాగార్జున ఇంత యంగ్ గా కనిపించడం నిజంగా వావ్ అంటున్నారు. నాగ్ డెడికేషన్, హార్డ్ వర్క్ కు వాళ్లు ఫ్యాన్స్ అయిపోతున్నారు. మొత్తానికి హీరోగా తమిళ్ లో నాగార్జునకు  రాని క్రేజ్ ఒక్క విలన్ పాత్రతో వచ్చేసింది.

Advertisment
తాజా కథనాలు