మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ ఒక్కటే : రాహుల్ గాంధీ

ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధానితో పోల్చారు రాహుల్ గాంధీ. సోమవారం ఈశాన్య ఢిల్లిలోని సీలంపూర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు.

New Update
Arvind Kejriwal and Rahul Gandhi

Arvind Kejriwal and Rahul Gandhi

ఇండియా కూటమిలో చీలికలు మొదలైయన విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకావడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధానితో పోల్చారు రాహుల్ గాంధీ. సోమవారం ఈశాన్య ఢిల్లిలోని సీలంపూర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారిద్దరూ దేశవ్యాప్తంగా కుల గణనకు మద్దతు ఇవ్వలేదని ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని పరిష్కరించడంలో కేజ్రీవాల్, ప్రధాని మోదీ విఫలమయ్యారని లోక్ సభ ప్రతిపక్షనేత, ఎంపీ రాహుల్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించడానికి ఒకరు, దాన్ని నాశనం చేయడానికి మరొకరు దేశంలో రెండు సిద్ధాంతాల యుద్ధం జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం భారత కూటమికి మిత్రపక్ష ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధాని నరేంద్ర మోడీతో పోల్చారు ఆయన. వారిద్దరూ తప్పుడు వాగ్దానాలు చేస్తారని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా కులగణన అంశం గురించి ప్రధాని మోదీ, కేజ్రీవాల్‌ ఇద్దరూ ఒక్కమాట కూడా మాట్లాడలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తుందని ఆ పార్టీని వ్యతిరేకించి కూటమి నుంచి కాంగ్రెస్‌ను తొలగించడానికి భారత కూటమిలోని ఇతర పార్టీలను సంప్రదిస్తామని ఆప్ పార్టీ నిర్ణయించుకున్న విషయం తెలిసింది. ఢిల్లీ అసెంబ్ల ఎన్నికల దృష్ట్యా కూటమిలో ఉన్న పార్టీల మధ్య చిచ్చు రగులుతోంది. 

Advertisment
తాజా కథనాలు