ఇటీవల హర్యానా, జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో ఝార్ఖండ్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంచీలో ఏర్పాటు చేసిన ‘సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్’ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఆదివాసీల గురించి బోధించడంలో మన విద్యావ్యస్థ ఫెయిలైందని అన్నారు.
Also Read: ఓఎల్‌ఎక్స్‌లో ప్రభుత్వ భూమి అమ్మకాలు.. తక్కువ ధరకే ఫ్లాట్లు!
మీ హక్కులను హరిస్తున్నారు
'' గిరిజనుల చరిత్ర, వారసత్వం, సంస్కృతి, వైద్య విధానాలను బీజేపీ నాశనం చేసేందుకు యత్నిస్తోంది. దళితులు, వెనకబడిన వర్గాల వారిని గౌరవిస్తున్నామని ప్రధాని మోదీ అంటున్నారు. కానీ ఆయన మీకు ఉండే హక్కులను హరిస్తున్నారు. సంస్థల నుంచి బహిష్కరిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖలో ఒక్క దళితుడు, గిరిజనుడు లేడు. ఆదివాసీల మూలాల గురించి బోధించడంలో మన విద్యావ్యవస్థ విఫలమైంది. మోదీ సర్కార్ రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు అన్ని రకాలుగా యత్నిస్తోంది. దాన్ని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు..
బీజేపీ CBI, EDలను నియంత్రిస్తోంది
కులగణన చేయడం అనేది సమాజానికి ఎక్స్-రే లాంటిది. దాన్ని ప్రధాని మోదీ వ్యతిరేకించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను బీజేపీ కంట్రోల్ చేస్తోంది. కమలం పార్టీ రాష్ట్రానికి నిధులు, సంస్థలను నియంత్రించవచ్చు. కానీ నిజాయతీని కాదని'' రాహుల్ గాంధీ అన్నారు. అలాగే ఝార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన పలు హామీలు కూడా ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని తెలిపారు. ఇదిలాఉండగా ఝార్ఖండ్‌లో ఇప్పటికే జేఎంఎం, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరించి. సీట్ల పంపిణీ గురించి త్వరలోనే స్పష్టత రానుంది.
Also Read: లెబనాన్ డ్రోన్ దాడి.. బెంజమిన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
Also Read: స్పెషల్ చికెన్.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!