PUNJAB: పంజాబ్ లో మరో దాడికి కుట్ర...భగ్నం చేసిన పోలీసులు

పంజాబ్ లో మరో ఉగ్రదాడి ని అక్కడి పోలీసులు భగ్నం చేశారు. అక్కడ అటవీ ప్రాంతంలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భారీగా గ్రెనేడ్‌లు, ఐఈడీలు సహా ఉగ్రవాద వైర్‌లెస్ కమ్యూనికేషన్ హార్డ్‌వేర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

New Update
police

Punjab Police

పహల్గాం దాడి తర్వాత హద్రతా బలగాలు పోలీసులు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎక్కడ ఏ మాత్రం అనుమానం వచ్చినా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అందులోనే మరిన్ని ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా పహారా కాస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్ లో ఉగ్రదాడి కుట్రను భగ్నం చేశారు అక్కడి పోలీసులు.

అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు..

పంజాబ్‌లోని అటవీ ప్రాంతం సమీపంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ ఉగ్ర స్థావరాలపై జరిపిన దాడుల్లో భారీగా గ్రెనేడ్‌లు, ఐఈడీలు సహా ఉగ్రవాద వైర్‌లెస్ కమ్యూనికేషన్ హార్డ్‌వేర్‌ను స్వాధీనం చేసుకుని వారి ప్లాన్ ను నాశనం చేశారు పంజాబ్ పోలీసులు. పంజాబ్‌లోని స్లీపర్ సెల్స్‌ను పునరుద్ధరించడానికి పాకిస్థాన్‌ నిఘా సంస్థతో అనుబంధం ఉన్న ఉగ్రవాద సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు గుర్తించామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు.

మరోవైపు జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.  బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లుగా గుర్తించిన భద్రతా బలగాలు ఇద్దరిని చెక్‌పోస్టు వద్ద అరెస్ట్ చేశారు.  వారి వద్ద నుంచి గ్రనేడ్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాయి. బుద్గాంలోని మాగంలోని బుచిపోరా కవూసా ఆరేస్‌లో నాకా చెకింగ్ ఆపరేషన్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.

today-latest-news-in-telugu | Terrorist Attack | punjab | police

Also Read: Mock Drill: కేంద్ర ప్రభుత్వ బిగ్గెస్ట్ యాక్షన్ ప్లాన్.. దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్..

Advertisment
తాజా కథనాలు