Gujarat: పాఠాలు సరిగ్గా చెప్పట్లేదని ఉపాధ్యాయుడిని కొట్టిన ప్రిన్సిపల్

సరిగ్గా చదవడం లేదని కొట్టే టీచర్లను చూస్తుంటాం..కానీ పాఠాలు సరిగ్గా చెప్పడం లేదని టీచర్లను కొట్టే ప్రిన్సిపల్ ను ఎప్పుడైనా చూశారా...గుజరాత్‌లోని భరూచ్ జిల్లా నవయుగ్ పాఠశాల ప్రిన్సిపల్ ఇదే పని చేశారు. దీని వీడియో వైరల్ అయింది. 

New Update
gj

Principal Slaps Teacher In Gujarat

గుజరాత్‌లోని భరూచ్ జిల్లా నవయుగ్ పాఠశాల ప్రిన్సిపాల్ హితేంద్ర సింగ్ ఠాకూర్...అదే స్కూల్ లో పని చేస్తున్న టీచర్ రాజేంద్రను 18 సార్లు చెంప దెబ్బ కొట్టారు. దీని తాలూకా వీడియో సీసీ టీవీలో రికార్డ్ అయింది. అది కాస్తా వైరల్ అయింది. దీంతో విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. అసలేం జరిగిందో దర్యాప్తు చేస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..

నవయుగ్ స్కూల్లో మ్యాథ్, సైన్స్ చెప్పే టీచర్ రాజేంద్ర మీద చాలానే కంప్లైంట్స్ ఉన్నాయి. చాలా రోజులుగా విద్యార్థులు టీచర్ సిగ్గా పాఠాలు చెప్పడం లేదని ప్రిన్సిపాల్ హితేంద్ర సింగ్ ఠాకూర్ కు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై మాట్లాడేందుకు ఆయన టీచర్లందరినీ మీటింగ్ కు పిలిచారు. అక్కడ రాజేంద్రను కంప్లైంట్స్ గురించి అడిగారు. కానీ అతను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రిన్సిపల్ టీచర్ రాజేంద్రపై దాడి చేశారు. 18 సార్లు చెంపపై కొట్టి కాళ్లు లాగి మరీ కింద పడేశాడు. కేవలం 25 సెకెన్లలో 18 సార్లు చెంపపగులకొట్టాడు ప్రిన్సిపాల్ హితేంద్ర సింగ్ ఠాకూర్. 

ప్రిన్సిపాల్ గా టీచర్లను మందలించడం, పనిష్మెంట్లు ఇవ్వడం చాలా సహజమైన విషయమే. కానీ ఇలా చితక్కొట్టడం మాత్రం వింతైన విషయం. అది కూడా అంత ఆగ్రహంతో ఊగిపోతూ కొట్టడం మరీ విచిత్రం. తాను కూర్చున్న కుర్చీ నుంచి ఆగ్రహంగా లేచి వచ్చి సదరు ఉపాధ్యాయుడి గల్లా పట్టుకున్నారు. ఇష్టం వచ్చినట్లుగా కొట్టడం ప్రారంభించారు. కొట్టాక అక్కడితో ఆగకుండా కాళ్ళు పట్టుకుని లాగేశారు కూడా. ఇదంతా చూస్తున్న తోటి ఉపాధ్యాయులు వచ్చి ఇద్దరినీ ఆపారు. కానీ వాళ్లు మాత్రం వెనక్కి తగ్గకుండా ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకున్నారు. అయితే ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.  ఇది కాస్తా బయటకు రావడంతో వైరల్ అయింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి స్వాతిబా రౌల్ ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు ఇద్దరి దగ్గరకు వెళ్ళి ప్రశ్నించగా...ప్రిన్సిపాల్, టీచర్ ఇద్దరూ తమ వెర్షన్లు చెప్పుకొచ్చారు. ఇందులో ఏది నిజమో తేలిన తర్వాత జిల్లా విద్యాశాఖాధికారులు వీరిపై చర్యలు తీసుకోనున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు