సంచలనం రేపుతున్న తృతీయ జ్యువెలరీ మోసం.. కాంతిదత్‌ అరెస్టు

తృతీయ జ్యువెల్లరీ మోసం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా రూ.100 కోట్ల వరకు మోసాలకు పాల్పడ్డ తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

New Update
TELUGUUU

తృతీయ జ్యువెల్లరీ మోసం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా రూ.100 కోట్ల వరకు మోసాలకు పాల్పడ్డ తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.  ఫోర్జరీ సంతకాలతో మోసాలకు పాల్పడినందుకు అతడిపై ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా కాంతిదత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. 

Also Read:చెక్ పవర్ రద్దు.. కలెక్టర్లకు ఆ అధికారం కట్.. పంచాయతీ రాజ్ చట్టంలో రానున్న మార్పులివే!

ఇక వివరాల్లోకి వెళ్తే.. సస్టెయిన్ కార్ట్ అనే పేరుతో కాంతిదత్ మోసాలకు తెరతీశాడు. పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ నమ్మించాడు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలకు ఎరవేశాడు. అతడిని నమ్మి వీళ్లు కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి మోసపోయారు. అయితే శ్రీజరెడ్డి అనే మహిళ తాను మోసపోయాయని గ్రహించి.. జూబ్లిహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హిరోయిన్లు, వ్యాపారవేత్తల నుంచి దాదాపు రూ.100 కోట్లు దోచుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఇండియా కూటమికి షాక్.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్న కేజ్రీవాల్

అయితే కాంతిదత్ బాధితుల్లో కీర్తి సురేశ్, సమంత, డిజైనర్ శిల్పారెడ్డి వంటి స్టార్లు కూడా ఉన్నారు. సంతకాలను ఫోర్జరీ చేసి మోసాలకు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి. సీసీఎస్‌లో కూడా అతడిపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే సస్టెయిన్ కార్ట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఏడాదిన్నర క్రితమే అందులో నుంచి బయటికి వచ్చానని శిల్పారెడ్డి నెల క్రితమే ఓ స్టేట్‌మెంట్‌ రిలీజ్ చేసింది. అలాగే కాంతిదత్‌తో కూడా తనకు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. 

Also Read: తుపాను ఎఫెక్ట్, విమానం ల్యాండ్ అయ్యేందుకు ఆటంకం.. చివరికి

Also Read: ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా నిషేధం.. మస్క్ విమర్శలు ఖండించిన ప్రధాని

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు