బీజేపీ అగ్రనేత, వ్యవస్థాపక సభ్యుడు, భారత మాజీ ఉప ప్రధాని మంత్రి ఎల్‌కె అద్వానీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎల్‌కే అద్వానీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేశానికి ఎల్‌కే అద్వానీ చేసిన సేవలకు గాను అతనికి భారత రత్న ప్రదానం చేశారని తెలిపారు. భారత దేశం ఎక్కువగా ఆరాధించే రాజనీతిజ్ఞులలో అతని ఒకరన్నారు. దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో అద్వానీ ముఖ్యపాత్ర పోషించారని, అతని మార్గదర్శకత్వంలో నేను వెళ్లడం తన అదృష్టమన్నారు. తన ఆరోగ్యమైన జీవితం కోసం నేను ప్రార్థిస్తున్నానని మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఇది కూడా చూడండి: Medak District: కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపంతో.. ఏం చేశాడంటే?
ఇది కూడా చూడండి: నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా?
మొదటిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్..
ఎల్‌కే అద్వానీ 1927లో నవంబర్ 8న ప్రస్తుతం పాకిస్థాన్‌లోని కరాచీలోని ఒక సంపన్న వ్యాపారవేత్త కిషన్ చంద్ అద్వానీ, జియాని దేవి దంపతులకు జన్మించారు. హైదరాబాద్‌లో డీజీ నేషనల్ కాలేజీలో చదివిన తర్వాత ముంబాయి న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో విధ్యనభ్యసించారు. ఆ తర్వాత మిలిటెంట్ హిందూ గ్రూప్ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరారు. దేశ విభజన జరిగిన తర్వాత భారత దేశం వచ్చిన తర్వాత శ్యాం ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ పార్టీలో చేరారు. ఆ తర్వాత రాజస్థాన్ జనసంఘ్ పార్టీ అధ్యక్షుడికి సలహాదారునిగా నియమితులయ్యారు.
ఇది కూడా చూడండి: టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఢిల్లీలో మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో 1966లో కార్పోరేషన్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1970లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. కానీ ఆ తర్వాత మీసా చట్టం కింద 1975లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. 1977లో జనతా పార్టీ తరపున పోటీ చేసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రెండు పార్టీలు కలవడంతో భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీ వచ్చింది. ఇలా కేంద్ర హోం మంత్రిగా మూడు సార్లు, భారత ఉపప్రధానిగా కూడా ఎన్నికయ్యారు. ఇతని చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం భారత రత్న కూడా ప్రదానం చేసింది.
ఇది కూడా చూడండి: KCR: కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులివే.. విద్యుత్ కమిషన్ సంచలన నివేదిక!