Medak District: కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపంతో.. ఏం చేశాడంటే? మెదక్ జిల్లాకి చెందిన కిషన్ మొబైల్ పోయిందని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. కానిస్టేబుల్ అతన్ని కొట్టాడు. దీంతో మనస్తాపం చెందిన కిషన్ లేఖ రాసి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. By Kusuma 08 Nov 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి మొబైల్ పోయిందని ఫిర్యాదు చేయడానికి ఓ యువకుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునన్న ఘటన మెదక్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన తలారి కిషన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామంలో తన భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. అయితే తన మొబైల్ ఫోన్ పోవడంతో కంప్లైంట్ చేయడానికి అల్లాదుర్గం పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. ఇది కూడా చూడండి: Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకించేందుకు రెడీ అయిన ట్రంప్.. పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని.. అక్కడి నుంచి వచ్చిన తర్వాత పెట్రోలు పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. అప్పడికే కిషన్ మరణించాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు కిషన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చూడండి: Rains: మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే.. ఆ తర్వాత అతని పర్సులో ఓ లేఖను గుర్తించారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. కానిస్టేబుల్ తిట్టారని, ఆఖరికి చేయి చేసుకున్నారని అందుకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో ఉంది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆగ్రహించి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఇది కూడా చూడండి: Russia: ట్రంప్‌తో చర్చలకు సిద్ధం–రష్యా అధ్యక్షుడు పుతిన్ వెంటనే కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపడతామని, తప్పకుండా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనను విరమించారు. కిషన్ మరణంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు కూడా విషాదంలోకి మునిగిపోయారు. ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారు–నాసా #telangana-constable #medak district #suicide మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి