KCR: కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులివే.. విద్యుత్ కమిషన్ సంచలన నివేదిక! యాదాద్రి, భద్రాద్రిలలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకోవడం, నామినేషన్‌పై బీహెచ్‌ఈఎల్‌కు ఇవ్వడం, ఇలా మొత్తం నాలుగు అంశాల్లో కేసీఆర్ సర్కార్ తప్పు చేసిందని, వీటికి మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని విద్యుత్ కమిషన్ తెలిపింది. By Kusuma 08 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ సర్కా్ర్ కొన్ని తప్పులు చేసిందని న్యాయ విచారణ కమిషన్ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. అయితే భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులపై నామినేషన్‌పై బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చింది. దీంతో ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో లోపాలు జరిగాయని, న్యాయ విచారణ కమిషన్ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. ముఖ్యంగా నాలుగు అంశాల్లో తప్పులు జరిగినట్లు నివేదిక తెలిపింది. డిసెంబర్‌లో జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని రేవంత్ ప్రభుత్వం ముందుగా నిర్ణయించుకుంది. కానీ మళ్లీ ఇప్పుడు ఈ నెల మూడో వారంలో ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. ఏడు అంశాలను కమిషన్ పరిధిలోకి చేర్చింది.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలు, లోపాలకు బాధ్యులు ఎవరో తెలియజేయాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఛైర్మన్‌గా ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మొత్తం 7 అంశాలను ఈ కమిషన్ పరిధిలోకి చేర్చింది. బిడ్డింగ్ లేకుండా ఛత్తీస్‌గఢ్ నుంచి నామినేషన్‌పై విద్యుత్తు కొనడం, వెయ్యి మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు ముందుగా ఒప్పందం చేసుకున్నారు. ఇది కూడా చూడండి: Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకించేందుకు రెడీ అయిన ట్రంప్.. భవిష్యత్తులో మళ్లీ అవసరం వస్తుందని, రెండువేల మెగావాట్ల సరఫరాకు తగ్గట్లుగా కారిడార్‌కు దరఖాస్తు చేయడం, ఒప్పందం చేసుకున్నంత వరకు విద్యుత్ మొత్తానికి కూడా చెల్లింపులు చెల్లించడం, తక్కువ విద్యుత్తు తీసుకోవడం వల్ల ఖజానాకు భారీనష్టం వాటిల్లడం, భద్రాద్రి, యాదాద్రిలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడటం, రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని గడువుపెట్టుకుని ఏడేళ్లు చేయడంతో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరగడం, బిడ్డింగ్ ద్వారా కాకుండా నామినేషన్‌పై ఇవ్వడం వంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇది కూడా చూడండి: Rains: మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే.. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించాలని లేఖ రాసింది. అయితే ముందుగానే కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు విచారణ కొనసాగిస్తూనే ఛైర్మన్‌ను మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. దీంతో తీర్పు రాకముందే జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా చేశారు. దీంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్‌ను ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. మొత్తం నాలుగు అంశాల్లో తప్పు జరిగిందని, కొన్నింటికి మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఇది కూడా చూడండి: Russia: ట్రంప్‌తో చర్చలకు సిద్ధం–రష్యా అధ్యక్షుడు పుతిన్ యాదాద్రి, భద్రాద్రిలలో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకోవడం అనేది తప్పు నిర్ణయమని తెలిపారు. నామినేషన్‌పై బీహెచ్‌ఈఎల్‌కు ఇవ్వడం తప్పని, దీనివల్ల జరిగిన నష్టానికి అంచనా వేయాల్సి ఉంది. అయితే దీనిపై నిపుణుల కమిటీని వేయాలా, లేకపోతే ఇంకా ఏదైనా పద్ధతి ఉందా? లేదా? అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనడాన్ని తప్పు పట్టలేము. ఎందుకంటే కొరత ఉండటం వల్ల కొనుగోలు చేశారన్నారు. వెయ్యి మెగావాట్ల సరఫరాకు ఒప్పందం చేసుకొని రెండువేల మెగావాట్లకు కారిడార్‌ను తీసుకోవడం, విద్యుత్తు సోర్స్ లేకుండా గ్రిడ్ బుక్ చేశారని కమిషన్ తప్పుపట్టింది. దీనివల్ల రూ.261 కోట్ల నష్టం వాటిల్లిందని కమిషన్ తెలిపింది. ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారు–నాసా #kcr #electricity-commission #telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి