Narendra Modi: హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ!

హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు, క్లౌడ్ బరస్ట్‌ల వల్ల కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధాని మోదీ పర్యటించారు. ఇలాంటి సమయాల్లో ప్రజలకు అండగా ఉంటామని మోదీ తెలిపారు. నిరంతరంగా సాయం అందిస్తామని వెల్లడించారు.

New Update
Pm Modi

Pm Modi

హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు, క్లౌడ్ బరస్ట్‌ల వల్ల కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధాని మోదీ పర్యటించారు. ఇలాంటి కష్ట సమయాల్లో ప్రజలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ తెలిపారు. నిరంతరంగా సాయం అందిస్తామని వెల్లడించారు. ఈ పరిస్థితులను అంచనా వేయడానికి వైమానిక సర్వేను చేపట్టినట్లు తెలియజేశారు. హిమాచల్ ప్రదేశ్‌తో పాటు పంజాబ్‌లో కూడా వరద పరిస్థితిని అంచనా వేయనున్నారు. ఈ క్రమంలో ధర్మశాలలో  రాష్ట్రా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. అలాగే ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న నివాసితులతో సంభాషించారు. వీటికి సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ఇది కూడా చూడండి:  DK Shivakumar: ఆశ లేకపోతే.. జీవితమే లేదు: సీఎం పోస్ట్‌పై డీకే సంచలన వ్యాఖ్యలు

ఎందుకు ఈ వైమానిక సర్వే..

వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవడం చాలా కష్టంగా ఉంది. దీంతో పరిస్థితిని సరిగ్గా అంచనా వేయడానికి వైమానిక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే వల్ల సహాయక చర్యలు ఏ ప్రాంతంలో ఎక్కువగా అవసరమో స్పష్టంగా తెలుస్తుంది. ఏరియల్ సర్వే ద్వారా దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలను గుర్తించడం సులభం అవుతుందని ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Vice Presidential Election : మరికొద్ది సేపట్లో ఉప రాష్ట్రపతి ఎన్నిక

Advertisment
తాజా కథనాలు