Trump Tariffs:అదనపు సుంకాలు పక్కా..మరోసారి ట్రంప్ ప్రకటన

భారత్ పై అదనపు సుంకాలు కచ్చితంగా విధిస్తామని మరోసారి కన్ఫార్మ్ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీనికి సంబంధించిన నోటీసులను ఢిల్లీకి పంపించారు. కొత్త సుంకాలు ఆగస్టు 27న  అమెరికా టైమ్ ప్రకారం అర్ధరాత్రి 12:01 నుంచి అమల్లోకి రానున్నాయి.

New Update
usa

Pm Narendra Modi, President Trump

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం తర్వాత భారత్ మీద టారీఫ్ లు తగ్గొచ్చని అన్నారు. కానీ దాని ప్రభావం ఏమీ కనిపించలేదు. అటు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ విరమణ మీదా ఒక నిర్ణయానికి రాలేదు. అలాగే ఇండియాపై సుంకాల మోతా తప్పలేదు. దీంతో మరో రెండు రోజుల్లో భారత్ పై అదనపు సుంకాల ప్రభావం పడనుంది. దీనిపై తాజాగా అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ద్వారా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆగస్టు 6న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై 25 శాతం సుంకాలు అమలు చేయబడతాయని సంతకాలు చేశారు. దీనికి సంబంధించిన నోటీసులను ఢిల్లీకి పంపించామని తెలిపింది.  కొత్త సుంకాలు ఆగస్టు 27న  అమెరికా టైమ్ ప్రకారం అర్ధరాత్రి 12:01 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14329ని సుంకాలు అమలు చేయనున్నారు. 

అదనపు సుంకాల ప్రభావం..

ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. దీని వలన భారత జీడీపై 0.2 శాతం నుంచి 0.5 శాతం అంటే దాదాపు రూ.2.60 లక్షల కోట్ల (30 బిలియన్ డాలర్లు) వరకు అదనపు భారం పడుతుంది. భారత్‌ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్నిరకాల వస్తువులపై 25 శాతం సుంకాల విధింపులతో మన దేశంలోని పలు రంగాలపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా అల్యూమినియం, ఉక్కు, వెహికిల్స్‌ విడిభాగాలు, రొయ్యలు, రత్నాభరణాలు, జౌళి, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఆహార ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. మనదేశం నుంచి అమెరికాకు 10 బిలియన్ డాలర్ల వరకు రత్నాభరణాలను ఎగుమతి చేస్తారు. అలాగే సముద్ర ఆహార ఉత్పత్తులైన రొయ్యలు వంటి వాటిపై తీవ్రంగా ప్రభావం ఉండనుంది. అంతేకాదు భారత్-బ్రిటన్‌ మధ్య జౌళి పరిశ్రమల ఒప్పందం కుదిరింది. దీనివల్ల వల్లే వచ్చే ప్రయోజనాలు అమెరికా టారిఫ్‌ వల్ల ప్రభావితం అవుతాయి.

సుంకాల గడుపు పెంచకపోవచ్చును..

భారతదేశంపై సుంకాలను రెట్టింపు చేయడంపై ట్రంప్ గడువును పెంచరని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. వారం రోజుల క్రితం ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో కూడా సుంకాలు పొడిగిస్తారని తాను ఆశించడం లేదని  అన్నారు.  సుంకాల్లో భారత్ మహారాజ్ వంటిదని చెప్పారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ న్యూ ఢిల్లీ లాభాలు గడించిందని..అమెరికాను మోసం చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ వివాదానికి భారత్ ఆజ్యం పోస్తోందని అన్నారు. నిజానికి ఇండియాకు రష్యా చమురు అక్కర్లేదు. కేవలం అధిక లాభాలను ఆర్జించడానికే వారు ఆ దేశం నుంచి చమురును కొనుగోలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడానికి ముందు..భారత్ వాస్తవంగా రష్యన్ చమురును కొనుగోలు చేయలేదు. అప్పుడు కేవలం ఒక శాతం మాత్రమే చమురు దిగుమతి చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ శాతం  35కి పెరిగింది.  నిజానికి ఇండియాకు  చమురు అవసరం లేదు. కేవలం ఇది రెండు దేశాల మధ్యనా లాభాల భాగస్వామ్య పథకం మాత్రమే అని పీటర్ ఆరోపించారు. భారత్...క్రెమ్లిన్ కు లాండ్రో మాట్ లాంటిదని అన్నారు. సుంకాల విధింపు తర్వాత వారు రష్యాతో మరింత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. మరోవైపు చైనాతో కూడా స్నేహాన్ని పెంచుకుంటున్నారని పీటర్ వ్యాఖ్యలు చేశారు. 

Advertisment
తాజా కథనాలు