Droupadi Murmu: సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్న రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ ద్రౌపది ముర్ము సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్నారు.  కర్ణాటకలోని కర్వార్‌ హార్బర్‌ నుంచి సముద్ర ప్రయాణం చేయనున్నారు.

New Update
President Murmu to undertake sea sortie in submarine on Dec 28

President Murmu to undertake sea sortie in submarine on Dec 28

రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ ద్రౌపది ముర్ము సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్నారు.  కర్ణాటకలోని కర్వార్‌ హార్బర్‌ నుంచి సముద్ర ప్రయాణం చేయనున్నారు. డిసెంబర్ 28న (ఆదివారం) ఈ ప్రయాణం ఉంటుందని శుక్రవారం రాజ్‌భవన్‌ అధికారికంగా ప్రకటన చేసింది. ముర్ము.. గోవా, ఝార్ఖండ్‌, కర్ణాటకలో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఆమె జలాంతర్గామిలో ప్రయాణం చేయనున్నారు. 

Also Read: 16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియాను నిషేధించాలి.. కేంద్రానికి సూచించిన హైకోర్టు

ఇదిలాఉండగా 2 నెలల క్రితం కూడా రాష్ట్రపతి ముర్ము ఇలాంటి సాహసం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫైల్‌లో ఆమె గగన విహారం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2023, మే 8న కూడా ద్రౌపది ముర్ము అస్సాంలో సుఖోయ్‌ 30 MKI యుద్ధ విమానంలో పయనించారు. తేజ్‌పుర్‌ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ నుంచి విమానంలో విహరించారు.  

Also Read: బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన మాజీ ప్రధాని కొడుకు, దేశం అన్ని మతాలకు చెందిందంటూ పిలుపు

ఇలాంటి ప్రయాణం చేసిన రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2009లో యూపీఏ హయాంలో అప్పటి రాష్ట్రపతి అయిన ప్రతిభా పాటిల్‌ కూడా ఇదే ఫైటర్ జెట్‌లో గగన విహారం చేసి రికార్డు సృష్టించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం 2006లో పుణె ఎయిర్‌ఫోర్స్‌ స్థావరం సుఖోయ్ 30 యుద్ధ విమానంలో ప్రయాణించారు. 

Advertisment
తాజా కథనాలు