TTD: తిరుమల వేంటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శుభవార్త చెప్పారు. ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగనున్న మహాకుంభమేళలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహాకుంభ మేళ జరుగనుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేసేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. తిరుమల తరహాలో శ్రీవారి కల్యాణోత్సవం.. ఈ మేరకు రామచంద్ర పుష్కరిణి వద్ద మీడియాతో మాట్లాడిన నాయుడు.. ప్రయాగ్ రాజ్‌లో ఉత్తరాధి భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. తిరుమల తరహాలో శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలు చేపడుతారని తెలిపారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్ప అలంకరణలు చేపట్టాలని సూచించినట్లు చెప్పారు. మహాకుంభ మేళకు సంబంధించి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని, దీంతో ముందస్తుగా కార్యాచరణ సిద్దం చేసినట్లు వెల్లడించారు. మహాకుంభ మేళకు టీటీడీ అధికారులు సమిష్టిగా ఏర్పాట్లు చేస్తున్నారని, ఎస్వీబీసీ ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తామన్నారు. ఇది కూడా చదవండి: KTR: కేటీఆర్ ఆ విషయంలో వీకా.. ఎంపీ చామల సంచలన కామెంట్స్! ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈవో శ్రీమతి ఎం.గౌతమి, సివిఎస్వో శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ ఎన్. మౌర్య, టీటీడీ సీఈ శ్రీ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: Hydra Jobs: హైడ్రాలో 970 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు!