/rtv/media/media_files/2025/10/07/prashant-2025-10-07-14-47-14.jpg)
బీహార్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ సారి రెండ విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6వ తేదీన మొదటి విడత పోలింగ్, నవంబర్ 11వ తేదీన రెండో విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. బీహార్‌లో మొత్తం 243 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుత బీహార్ శాసనసభ గడువు నవంబర్ 22తో ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి. ఎన్నికల వ్యూహకర్త నుండి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జాన్ సూరజ్ కూడా ఈ సారి పోటీలో ఉంది.
ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 9న మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. మొదటి జాబితాలో 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గం ఇందులో ఉంటుందా లేదా అన్నది అసక్తికరంగా మారింది. ప్రశాంత్ కిషోర్ అనేక సందర్భాల్లో తాను ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చెప్పారు. దీనిపై తుది నిర్ణయం పార్టీదేనని అన్నారు. ప్రశాంత్ కిషోర్ తన జన్మస్థలం అయిన కర్గహర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కర్గహర్ బ్రాహ్మణులు ఎక్కువగా నివసించే నియోజకవర్గం కాబట్టి, రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, ప్రశాంత్ కిషోర్ ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: చిన్న పిల్లల దగ్గుకు సిరప్ అవసరమే లేదు.. అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?
రఘోపూర్ నుంచి పోటీ చేస్తారా
ఒకవేళ ప్రశాంత్ కిషోర్ ఇక్కడి నుంచి పోటీ చేయకపోతే, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్‌ను సవాలు చేయడానికి రఘోపూర్ నుంచి పోటీ చేస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ రఘోపూర్ నుంచి పోటీ చేస్తే, ఈ స్థానానికి నవంబర్ 6న మొదటి దశలో ఓటింగ్ జరుగుతుంది. కర్గహర్ నుంచి పోటీ చేస్తే రెండో విడుతలో పోలింగ్ జరుగుతుంది. ఇక బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జన్ సురాజ్ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏ కూటమితోనూ పొత్తు పెట్టుకోమని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
పార్టీ తరఫున కనీసం 40 మంది మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని ప్రశాంత్ కిషోర్ ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ పార్టీ (జేడీయూ) 25 కంటే ఎక్కువ స్థానాలు గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కిషోర్ సవాల్ విసిరారు. ఈ ఎన్నికలే నితీష్ కుమార్‌కు చివరి ఎన్నికలు అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. గత 35 ఏళ్లుగా బీహార్‌ను పాలించిన ఆర్జేడీ, జేడీయూ కూటములపై (ఎన్డీఏ, మహాకూటమి) ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కుల రాజకీయాలకు, అవినీతికి వ్యతిరేకంగా, పాలనా సంస్కరణలపై ఆయన ప్రచారం సాగుతోంది.