ఇండియాలో 2024ఏడాదిలో రాజకీయాలు ఒక ఊపు ఊపాయి. దేశ వ్యాప్తంగా ఊహించని పరిణామాలు జరిగాయి. పాత వారు పోయారు...కొత్త వారు వచ్చారు. ఇందులో కొంత మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వయనాడ్‌లో ప్రియాంకాగాంధీతో సహా పిఠాపురంలో పవన్‌కల్యాణ్ వరకు ఎందరో ప్రముఖులు ఎన్నికల్లో గెలిచారు. వారెవరూ ఒకసారి చూసేద్దాం.
ప్రియాంకా గాంధీ..
రాజీవ్ గాంధీ కూతురుగా, రాహుల్ చెల్లెల్లుగా ప్రియాంకాగాంధీ అందరికీ తెలిసినవారే. రాజకీయ కుటుంబంలో పుట్టి..వాటితో చాలా దగ్గరగా సంబంధం ఉన్నా కూడా ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ప్రచారసభల్లో, కాంగ్రెస్ మీటింగ్‌లలోరాల్గొనే ప్రియాకాగాంధీ మొట్టమొదటిఆరి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టారు. సార్వ్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనా, రాయబరేలీ రెండు చోట్ల నుంచి గెలిచారు. అయితే ఇందులో ఒకటే స్థానాన్ని ఉంచుకోవాల్సి వచ్చింది. దాంతో ఆయన వాయనాడ్‌ను వదులుకున్నారు. దీంతో అక్కడ మళ్ళీ ఎన్నికలను నిర్వహించారు. ఇందులో కాంగ్రెస తరుఫు నుంచి ప్రియాంక గాంధీ నిలబడి విజయం సాధించారు. పోటీ చేసిన మొదటిసారే గెలిచి రికార్డ్ సృష్టించారు.
పవన్ కల్యాణ్...
2024 ఏడాది పవన్ కల్యాణ్‌కు బాగా కలసి వచ్చింది. 2019 ఎన్నికల్లో దారుణంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల్లో మాత్రం తనదైన ముద్ర వేశారు. చంద్రబాఉ నాయుడు అరెస్ట్ అవడం, టీడీపీ, జనసేన, బీజేపీలు కలవడం, ఎన్నికల ప్రచారం అన్నింటిలో ప్రముఖ పాత్ర వహించారు పవన్ కల్యాణ్. అంతేకాదు పిఠపురం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచారు కూడా. 2019లో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ...ప్రజల్లోకి వెళ్ళి మంచి ఏతగా పేరు సంపాదించుకున్నారు. ఆంధ్రీఓ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక డిప్యూటీ సీఎంగా బాధ్యతలను కూడా చేట్టారు.
నారా లోకేశ్...
నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్. పప్పు అని, మాట్లాడ్డం కూడా సరిగా రాదని..పేరు సంపాదించుకున్నాడు. చంద్రబాబుకు సరైన రాజకీయ వారసుడు లేడని అనుకున్నారు. కానీ ఓడలు బళ్ళు...బళ్ళు ఓడలు అవుతాయని నిరూపించారు నారా లోకేశ్. 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలు చేసి పార్టీ గెలవడానికి కృషి చేశారు.
కంగనా రౌనత్...
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా ఎన్నికైంది. ఆమె హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగింది. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై 74,755 ఆధిక్యంతో గెలుపొంది.
భరత్..
భరత్...బాలకృష్ణ చిన్న అల్లుడు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ విజయంతో గెలుపొందారు. తొలిసారి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. విశాఖలో గీతం యూనివర్సిటీ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు.
కల్పనా సోరెన్
కల్పనా సోరెన్.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య. హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఈమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆయన జైలుకు వెళ్ళాక ముఖ్యమంత్రిగా కల్పనా సోరెన్ అవుతారని ప్రచారం జరిగింది. అయితే తోడి కోడలు సీతా సోరెన్ అడ్డుపడడంతో.. సీఎం కుర్చీ దూరమైంది. తర్వాత అసెంబ్లీ బైపోల్‌లో కల్పనా సోరెన్ విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇక నవంబర్‌లో జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరోసారి గాండే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తీవ్ర కృషి చేశారు.