సంభాల్‌లో కొత్త నిర్మాణం.. పోలీసుల కీలక ప్రకటన

యూపీలోని సంభాల్‌లో జామా మసీదు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కొత్త పోలీస్ పోస్టును నిర్మించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ స్థలంలో పోలీస్ స్టేషన్‌ను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే ఈ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.

New Update
Police Post at Sambhal

Police Post at Sambhal

ఉత్తరప్రదేశ్‌లోని చందౌసి జిల్లా సంభాల్‌లో మెట్లబావి, మృత్యుబావి వంటి చారిత్రక కట్టడాలు ఇటీవల బయటపడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న జామా మసీదు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కొత్త పోలీస్ పోస్టును నిర్మించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ స్థలంలో పోలీస్ స్టేషన్‌ను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే ఈ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. స్థలాన్ని కూడా ఇప్పటికే కొలిచామని పేర్కొన్నారు.

Also Read: హార్ట్ సర్జరీ అయ్యాక మన్మోహన్ సింగ్ అన్న మాటలు ఇవే..

 ఉత్తరప్రదేశ్‌లోని చందౌసి జిల్లాలో తవ్వకాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మెట్లబావి బయటపడగా.. గురువారం మరో అద్భుతం వెలుగుచూసింది. జామా మసీదుకు 100 మీటర్ల దూరంలోనే ఒక బావి కనిపించింది. హిందువులు ఎక్కువగా ఉంటున్న ప్రాంతంలోనే ఈ బావి బయటపడింది. అయితే దీన్ని మృత్యుబావిగా పిలుస్తున్నారు. ఈ బావికి సమీపంలోనే ఒక ఆలయం ఉందని.. అది మృత్యుంజయ మహాదేవ్ ఆలయమని స్థానికులు చెబుతున్నారు.

Also Read: మన్మోహన్ తో వైఎస్, చంద్రబాబు, KCRతో పాటు తెలుగు ముఖ్య నేతలు

ఇదిలాఉండగా.. మరోవైపు యోగీ సర్కార్ సంభల్‌ తీర్థయాత్ర స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు వేస్తోంది. దీనికి సంబంధించిన పనులను కూడా ముమ్మరం చేసింది.ఇక్కడి జిల్లా యంత్రాగం ఈ ప్రాంతంలో ఒక పురాతన శివాలయాన్ని గుర్తించింది. దీన్ని 1978లో మూసివేసినట్లు పేర్కొంది. అయితే ఇటీవల జరిపిన తవ్వకాల్లో మెట్లబావి కూడా బయటపడటంతో.. యోగీ ప్రభుత్వం శివాలయాన్ని మళ్లీ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. 

Also Read: స్వర్గంలో రతన్ టాటా, కలాం, శాస్త్రితో మన్మోహన్.. వైరల్ అవుతున్న AI ఫొటోలు!

#telugu-news #national #latest-news-in-telugu #uttarpradesh #sambhal issue
Advertisment
తాజా కథనాలు