/rtv/media/media_files/2025/11/11/prasadam-2025-11-11-07-31-12.jpg)
దేశంలో మళ్ళీ అల్లకల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ ప్లాన్ లే వేశారు. దీని కోసం పెద్ద నగరాలనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలో పేలిన కారు బాంబే ఇందుకు నిదర్శనం. దీని తరువాత ఫరీదాబాద్ లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు బయటపడడం ద్వారా మరిన్ని ఉగ్ర దాడులకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. దాంతో హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఫ్లానే బయటపడింది.
నీళ్ళు, ప్రసాదాల్లో విషం..
తాజాగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఒక హైదరాబాద్ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మోహియుద్ధీన్ ను అరెస్ట్ చేశారు. ఇతను హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించాడని పోలీసు విచారణలో తేలింది. రాజేంద్ర నగర్ సర్కిల్ ఫోర్ట్ వ్య కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్...చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆ తరువాత ఆన్ లైన్ కన్సల్టెంట్ డాక్టర్ గా పని చేస్తూ ఉగ్రవాదులతో పరిచయం పెంచుకున్నాడు. ఆ క్రమంలో పాకిస్తానీహ్యాండ్లర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన రిసిన్ కెమికల్ తో దాడులు చేసేందుకు ప్లాన్ చేశాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాల్లో రిసిన్ ఒకటి. రుచి, వాసన లేకపోవడం దీని ప్రత్యేకత. దీనిని ఎందులో కలిపినా ఎవరూ గుర్తుపట్టలేరు. చివరకు నీళ్ళల్లో కలిపినా కూడా తెలియదు. అందుకే ప్రజలను చంపేందుకు దీనిని ఎంచుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ పాయిజన్ ను దేశంలోని ప్రధాన నగరాల్లో మంచి నీళ్ళు, గుడి ప్రసాదాల్లో కలిపి ఇచ్చేందుకు ప్లాన్ చేశాడు డాక్టర్ సయ్యద్ మొహయుద్దీన్. విషాన్ని ఇవ్వడం ద్వారా దేశంలో వేలాది మంది మరణించేలా ప్రణాళికలు తయారు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు ఢిల్లీతో పాటూ మరి కొన్ని చోట్ల బాంబులు పేల్చేందుకు ఉగ్రవాదులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీ పేలుడు తర్వాత జమ్మూ-కాశ్మీర్ పోలీసులు అప్రత్తంఅవండంతో మితా వాటిని జరగకుండా ఆపగలిగారు. ఈ క్రమంలో నిషేధిత జైషే మహ్మద్, అన్సార్ గజ్‌వత్ ఉల్ హింద్ ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. అదీల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహిన్ ల దగ్గర నుంచి పలుడుకు సంబంధించిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు మహిళ కావడం గమనార్హం. హరియాణాలోని ఫరీదాబాద్ లో పేలుడికిసబంధించి అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్‌తో కూడిన పేలుడు పదార్థాలు భారీ ఎత్తున పోగుచేశారు. ఇది దాదాపు 3 వేల కేజీలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
Also Read: DELHI BLAST: డిల్లీ పేలుళ్లకు పుల్వామా లింకులు.. బయటపడుతున్న షాకింగ్ నిజాలు!
Follow Us