/rtv/media/media_files/2025/11/11/pulwama-2025-11-11-07-00-13.jpg)
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలి తొమ్మిది మరణించగా...దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. దాడికి కారణమైన ఐ20 కారును పలుసార్లు కొనడం, అమ్మడం చేశారని తెలుస్తోంది. దీనిని పుల్వామాకు చెందిన తారీఖ్ అనే వ్యక్తి అమ్మినట్లు పోలీసులు కనుగొన్నారు. దాంతో పాటూ బాంబు పేలిన కారు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. హరియాణాకు చెందిన నదీమ్‌ఖాన్ పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో కారులో ముగ్గురు ఉన్నారని చెప్పారు. హుండాయ్ ఐ20 కారును మొదట మహ్మద్ సల్మాన్ కొన్నారు. తర్వాత దానిని నదీమ్‌ఖాన్ అనే వ్యక్తికి అమ్మారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం సల్మాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
दिल्ली ब्लास्ट का पुलवामा कनेक्शन आया सामने! जम्मू-कश्मीर के तारिक को बेची गई थी कार#Delhi#Blast#Pulwama#JammuKashmirhttps://t.co/LPslJlHFzL
— ABP Live Delhi (@abplivedelhi) November 10, 2025
నకిలీ పత్రాలు..
అసలు దాడికి కారణమైన కారు వరిది అనేది దానిని పోలీసులు ఛేదించే పనిలో పడ్డారు. ఆర్టీవో తో కలిసి కారు యమానిని వెదికే పనిలో పడ్డారు. HR26 నంబర్ గల ఈ వాహనం గురుగ్రామ్ నుండి వచ్చింది. దేవేంద్ర హర్యానాలోని అంబాలాలో ఒకరికి కారును విక్రయించాడని దర్యాప్తులో తేలింది. కారు కొనుగోలు మరియు అమ్మకాలలో నకిలీ పత్రాలను ఉపయోగించారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఫరీదాబాద్ లో పట్టుబడ్డ డాక్టర్లు, పేలుడు పదార్థాల ఆధారంగా కూడా ఢిల్లీ బాంబు బ్లాస్ కేసును విచారిస్తున్నారు. అక్కడ దొరికిన పేలుడు పదార్థాలు, ఢిల్లీ బ్లాస్ట్ లో ఉపయోగించిన పేలుడు పదార్థాలు ఒక్కటేననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఇంకెన్ని చోట్ల దాడులకు ప్లాన్ చేశారనే దానిపై ఆరాలు తీస్తున్నారు.
ఢిల్లీలో హై అలెర్ట్..
మరోవైపు ఢిల్లీలో ప్రస్తుతం హై అలెర్ట్ ప్రకటించారు. ఢిల్లీ మెట్రో, ఎర్రకోట, ప్రభుత్వ భవనాలు, ఐజిఐ విమానాశ్రయంతో సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లోని సిఐఎస్ఎఫ్ భద్రత కల్పించిన సంస్థలను హై అలర్ట్‌లో ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భద్రతా దళాలను సిద్ధంగా ఉంచారు అని సిఐఎస్ఎఫ్ తెలిపింది.
Also Read: Explosives Found: భారీ ఉగ్ర కుట్ర భగ్నం..2,900 కేజీల పేలుడు పదార్ధాలు స్వాధీనం
Follow Us